జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

జాడలు

 • ప్రచురించిన సమయం: 5:40:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


నా కన్నుల మాటున దాగిన బాసలు..
నా పెదవుల చాటున చిక్కిన ఊసులు..
నా ఎద సడిలో ఇంకా పురివిప్పని ఊహలు..
నా అంతరంగమధనపు కన్నీటి కలలు..
నా మది నడిసంద్రపు జ్ఞాపకాల అలలు..
నా హృదయ అంతర్వాహినిని తాకే తప్త శిలలు..
నాలో మమేకమై, జీవితాంతం నిలిచే నీ జ్ఞాపకాలు..
నా మనోవ్యధను తీర్చే మలయమారుతపు వీచికలు..
నా గుండె గుప్పిట దాగిన విరహాగ్నిని దాచే కనీనికలు..
నా స్వాప్నికజగత్తులో నాతొ విహరించే నా అభిసారికలు…

అన్నీ నీవే.. అంతా నీ తావే.. అనంతానా నీ జాడే..

దగ్ధగీతం..

 • ప్రచురించిన సమయం: 5:07:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


వింటారా..??
వినీలాకాశంలో తారకలు తలుక్కున అందిస్తున్న..
మేఘలోకంలో మెరుపులు తటిల్లున నినదిస్తున్న..
దగ్ధగీతం..

వింటారా..??
గడ్డిపూలపై నిలిచిన తుషారబిందువుల చారకలు చూపిస్తున్న..
ధరిత్రీతలంపై మొలచిన గడ్డిపరకల మరకలు కురిపిస్తున్న..
దగ్ధగీతం..

వింటారా..??
చీకటిలో వెలుగు పంచుతూ తను కరిగిపోయే కొవ్వొత్తి రాసే..
రెక్కలొచ్చిన పక్షి గూడు వదిలితే కన్నతల్లి పడే తపన మోసే..
దగ్ధగీతం..

వింటారా..??
కొమ్మన కొమ్మన నిలబడలేక కోయిల విలపిస్తున్న..
రెమ్మన రెమ్మనుంచి రాలిపోయే పుష్పాలు ఆలపిస్తున్న..
దగ్ధగీతం..

చూస్తారా ఎదలో నే రాసుకుంటున్న దగ్ధగీతం..
వింటారా మదిలో నే పాడుకొంటున్న దగ్ధగీతం..

Apocalypto

 • ప్రచురించిన సమయం: 10:13:00 AM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: సినిమాలు


నేను ఈ మధ్య MelGibson దర్శకత్వం వహించిన Apocalypto సినిమాని చూడటం జరిగింది. దీన్ని చూసిన మొదలు బ్లాగ్ లోకంలోని మిత్రులందరికీ దీన్ని పరిచయం చెయ్యాలనిపించింది. సినిమా అద్యంతమూ చాలా ఆసక్తితో నడుస్తుంది. ఇలా సినిమాని అద్యంతమూ ఆసక్తిగా నడిపించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. ఇక సినిమా కథ, కథనాల విషయం దగ్గరికి వస్తే,

సినిమా మొదలు కావడమే Will Durant యొక్క ఒక quote "A great civilization is not conquered from without until it has destroyed itself from within." తో మొదలవుతుంది. ఇందులో హీరో ఒక ఆటవిక తెగకి చెందిన నాయకుని కొడుకు. తనకి గర్భంతో ఉన్న భార్యా ఒక కొడుకు ఉంటారు. ఆ తెగకి చెందిన వారితో కలిసి అడవిలో జంతువులని వేటాడుతూ అక్కడే నివసిస్తూ ఉంటారు. ఒకానొక రోజు ఆ తెగ మీదకి వేరే తెగ వారు దండెత్తుతారు. ఆ సందర్భంలో మన కథానాయకుడు వాళ్ళకి తెలియకుండా తన భార్యా పిల్లల్ని అక్కడే ఉన్న ఒక పెద్ద బావిలాంటి దానిలో దాచి పెడతాడు. దాడి చేసిన తెగవారు హీరోతో పాటు కొంతమందిని బందీలుగా పట్టుకొని కొంతమందిని చంపేస్తారు. చనిపోయినవారిలో హీరో తండ్రి కూడా ఉంటాడు.

దాడి చేసిన తెగవారు అందరిని బంధించి తమ "మాయా" పట్టణానికి తరలిస్తారు. అక్కడ వారిని బలికోసం సిద్దం చేసిన వేదిక మీద కొంతమందిని బలిస్తారు. ఆ దృశ్యాన్ని దర్శకుడు ఎంతో హృదయవిదారకంగా చూపిస్తాడు. ఇంతకీ బలి ఎందుకోసం ఇస్తారో మీరు తెర మీద చూస్తేనే మంచిది. కొంతసేపటికి హీరో ఎలానో ఒకలా వారి చెర నుంచి తప్పించుకొని తన భార్యా బిడ్డల్ని కాపాడేదానికి బయలుదేరుతాడు. తప్పించుకొనే క్రమంలో దాడి చేసిన తెగ యొక్క నాయకుని కుమారున్ని అంతమొందిస్తాడు. ఎలాగైనా హీరో ని చంపాలనే కృతనిశ్చయంతో దా.తె.నా., ఎలాగైనా కుటుంబాన్ని రక్షించుకోవాలని హీరో అడవిలోకి బయలుదేరుతారు. హీరో తన కుటుంబాన్ని రక్షించు కొన్నాడా లేదా? దా.తె.నా. ఏమయ్యాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మిగతా కథ మీరు వెండి తెర మీద చూడాల్సిందే.

మరచిపోయాను చెప్పడం, ఈ చిత్రం 2007 సం" గాను 3 OSCAR awards ని గెలుచుకొంది.

మీరు ఈ సినిమా ని చూడాలనుకొంటే ఇక్కడ చూడవచ్చు.


సినిమా పేరు: Apocalypto
దర్శకుడు: Mel Gibson
సంస్థ: Icon Productions & Disney
తారాగణం: Rudy Youngblood, Dalia Hernández, Jonathan Brewer మొ" వారు.

నీకెలా తెలుపను?

 • ప్రచురించిన సమయం: 11:08:00 AM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..

నిశ్శబ్ధ నీరవ నిశీధిలో,
చిరుదివ్వెపు వెలుగువై కనిపిస్తావని..

పున్నమి వెన్నెల తరంగాలలో,
వెల్లువలా వెలువెత్తుతావని..

వసంత మలయమారుతంలో,
మరుమల్లియలా మురిపిస్తావని..

చల్లని సంధ్యా సమయంలో,
సంగీతంలా వినిపిస్తావని..

అల్లన మెల్లన పిల్లగాలులలో,
ఊహాల ఊయలవై ఊపేస్తావని..

పరిమళించు సుమ సుగంధాలలో,
విరిసిన నీ ఊసులు పంపిస్తావని..
ఇలా..
నీకై వేయికన్నులతో వేచియున్నానని,
నీ కెలా చెప్పను??

కానరాని నీ కోసం ఎక్కడని వెతుకను??
ఎవ్వరిని అడుగను??

నా మది లో నిండిన రూపానివి నీవని..
నా ఎదలో విరిసిన ఊహాకుసుమం నీవని..
నీకెలా తెలుపను??

నా కళ్లు..

 • ప్రచురించిన సమయం: 2:32:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


కలలు మానిన నా కళ్లు..
నీపై ఆరాధనకు నకళ్ళు..

తలపుల తావిలో తడిచిన నా కళ్లు..
నీపై సరాగాల తోలకరి జల్లు..

వుహాల పెన్నిధిలో వూయలూగిన నా కళ్లు..
నీపై అనురాగపు పూజల్లు..

కనీనికలో నీ చిత్తురువుని దాచిన నా కళ్లు..
అనంతపు అందాల హరివిల్లు..

క్షణమైనా మూయని నా కళ్లు..
నీపై నిలిచిన చూపులకు సంకెళ్ళు..

నిశ్శబ్దపు నీరాజనాల నా కళ్లు..
నీపై ముసిరిన వలపులకు వాకిళ్ళు..

Note: కలలో.. కన్నీటి అలలో.. బ్లాగులో కల వాడిన కనీనిక అన్న పదం నాకు తెగ నచ్చి దానిని ఈ టపాలో వాడేసాను.
కృతజ్ఞతలు to కల.

గుర్తున్నవా??

 • ప్రచురించిన సమయం: 5:44:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


ఆగని కాలం వెంబడి పరుగులు తీస్తూ..
ఎగిసే అలల పైబడి అందనంత ఎత్తుకు ఎగుస్తూ..
కరిగే కలల కోసం వెంబర్లాడుతూ..
నే తీసే పరుగులు నీకు గుర్తున్నవా??

ఊహా సౌధాల వెంబడి ఉరుకులు పెడుతూ..
గడచిన గతాల కోసం ఎదను త్రవ్వుతూ..
నీ సన్నిధిలో ఆగిన క్షణాలను అందుకొంటూ..
నే వేసే అడుగులు నీకు గుర్తున్నవా??

నీ నీడను అనుగమిస్తూ..
నీ జాడను అనుసరిస్తూ..
నీ శ్వాసను తీసుకుంటూ..
నీ ధ్యాసను మోసుకుంటూ..
నే రాల్చే కన్నీటి మడుగులు నీకు గుర్తున్నవా?

అన్వేషణ

 • ప్రచురించిన సమయం: 5:16:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


ఆలోచనల అనంత సాగర గర్భాన నిలుచుంటావు..
సులోచనల రెప్పల మాటున సిత్రమై దాగుండిపోతావు..
అంతులేని ఊహల మేఘమాలికలలో పవళించిపోతావు..
పొంతన లేని కలలా కడలి కెరటమై నను ముంచెత్తుతావు..
సైతకసీమల్లో శిలలా నిలిచి నను మైమరచుతావు..
ప్రతిరోజూ నిన్నటి కలలా మిగిలి నను ఏకాంతంలో నిలిపేస్తావు..
నేడు రేపయ్యేలోగానే నను ఊహల్లో నిలిపి, నిన్నటి స్వప్నంలా మిగిలిపోతావు..

మొన్నటి జ్ఞాపకంలా నను చేరి..
నిన్నటి కలలా నేటి ఊసుల్లోకి మారి..
నేటి తలపులా ఎదలోకి జారి..
రేపటి ఊహలా కంటిపాపలోకి దూరి..
నిత్యం నను మాయచేసి నా మది పరదా చాటున నీలినీడలా పరుండిపోతావు..

నేను నా బ్లాగు రూపురేఖల్ని మార్చేసానోచ్..

 • ప్రచురించిన సమయం: 2:52:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: ఇదీ సంగతీ..

ప్రియమైన బ్లాగు మిత్రులందరికీ,
నేను నా బ్లాగు రూపురేఖల్ని మార్చేసాను. చూసిన వారందరూ చాలా బావుంది అని అంటున్నారు. మీకు ఈ template నచ్చితే దాన్ని ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోండి.
నా బ్లాగు రూపురేఖలు మార్చడంలో సహాయ పడ్డవారందరికి కృతజ్ఞతలు. మీకు మరిన్ని templates కావాలా? అయితే తెలుగు'వాడి'ని గారి బ్లాగుని ఒక సారి సందర్శించండి. నేను ఈ template ని అక్కడి నుంచి దిగుమతి చేసుకొని నాకు నచ్చిన విధంగా మార్చుకొన్నాను. మీకు ఈ template ఉపయోగించడంలో ఏమన్నా సందేహాలుంటే మీ సహాయానికి నేను ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటాను. నేను కాకపోయినా మన బ్లాగులోకంలోని techies (వీవెన్, ప్రవీణ్, ప్రదీప్, కిరణ్) ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటారు.

గమనిక: ఈ template ఉపయోగించే ముందు మీ పాట template ని ముందు జాగ్రత్తగా దిగుమతి చేసి పెట్టుకోండి. మరో ముఖ్యమైన విషయం, మీరు ఇదివరకు ఏమన్నా page elements ఉపయోగించి ఉన్నట్ట్లైతే అవన్నీ పోతాయి కావున, కాస్త జాగురూకతతో వ్యవహరించండి. వాటిని, వాటిలో ఉండే విషయాలన్నింటిని ముందే ఎక్కడన్నా save చేసి పెట్టుకోవడం మరవొద్దు.

p.s. ప్రత్యేక కృతజ్ఞతలు: తెలుగు'వాడి'ని గారికి మరియు ఈ template ఎంపికలో సహకరించిన నా మిత్రురాలు కల కి కూడా..

మరచిపోయావా?

 • ప్రచురించిన సమయం: 3:46:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..


మరచిపోయావా?
నువ్వు నేను కలిసి పంచుకొన్న ఊహలు..
మనస్సూ మనస్సూ కలిపి విరచించుకొన్న ఊసులు..

వాడిపోయాయా?
నాకై నువు రువ్విన ఓరచూపుల కంటికొనల ధృక్కులు..
నాకై నువు రాల్చిన మంత్ర ముగ్ధపు మనోహర వాక్కులు..

చెరిగిపోయాయా?
నువ్వు నేను మెలిసి నడిచిన దారిలో విరిసిన పాదముద్రలు..
నువ్వు నేను రాసి మది అంతరంగపు పుటల్లో దాచుకున్న కవితలు..

కరిగిపోయాయా?
నీకై నేను పంపిన వలపు మేఘసందేశాల ఆనందవీచికలు..
నీకై నేను వొంపిన తలపు తనూ వైభవపు విరీచికలు..

తరిగిపోయాయా?
చేయి చేయి కలిపి వెన్నెల రాత్రుల్లో మనం ఆలపించిన మంజీరనాదాలు..
ధ్యాస శ్వాస కలగలిపి పున్నమి కాంతుల్లో మనం తిలకించిన సాగరకెరటాలు..

మరచిపోయావా?
మన్ను మిన్ను కలిసినట్లున్నా అవి ఎప్పటికీ కలవవన్న నిజం..
కన్ను కన్ను పక్కనే ఉన్నా అవి ఎప్పటికీ చూసుకోలేవన్న నిజం..

ఎంకి..

 • ప్రచురించిన సమయం: 2:36:00 PM
 • |
 • రాసినవారు: ప్రతాప్
 • |
 • వర్గము: కవితలు..

పృథ్వీ గారు గీసిన ఒక అద్భుతమైన కళాఖండానికి నా స్పందన..

కడవనెట్టుకొన్న రాయంచ చెరువుగట్టు మీద నడచుచుండ..
రెప్పదాటుకొన్న చూపు పడతి చనుకట్టు మీద పడుచుండ..
పిక్కదాటుకొన్న అతివ చీరకట్టు మదిన మరీచికలు వీచుచుండ..
మనస్సు దోచుకున్న మగువ కనికట్టు ఎద చప్పుడు దోచుచుండ..

అలమెల్లన కదిలే రమణి కృష్ణవేణి జంటసర్పాలేమో అనిపించుచుండ..
వాలుకళ్ళలో మెదిలే తొయ్యలి భావమోహనం రాగ వీచికలు ఆలపించుచుండ..
పల్లెలో విరిసిన మానిని ముగ్ద మోహన సౌందర్యం ఎంకిని తలపించుచుండ..
సుదతి ముఖారవిందం చూసి పద్మమేమో అని భ్రమరం భ్రమించుచుండ..

లలన ఆలన మెల్లన వయ్యారియై, భీతన హరిణేక్షియై..
చెరువు గట్టు దాటి, పుట్ట దాటి పల్లెవైపు సాగిపోయింది.

ఫృధ్వి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..