జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అతడొక సైన్యం..

  • ప్రచురించిన సమయం: 10:48:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..



అతడొక సైన్యం..
ఎదను మండించిన ఆక్రోశాన్ని ఆయుధంగా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..
కుతకుతలాడే రుధిరపు ఆవేశాన్ని కరవాలంగా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
కారే కన్నీటి చుక్కలని తుపాకీ గుండ్లలా మార్చి, కదులుతున్నాడు కదనరంగానికి..
దూరే పిరికితనాన్ని నిర్జించి, ధైర్యాన్ని ధరించి, కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
కూలే బ్రతుకులు, కాలే కడుపులు, రగల్చిన మంటని మోస్తూ కదులుతున్నాడు కదనరంగానికి..
అవినీతి సెగలూ, అసమర్ధపు చేతలూ, మిగిల్చిన బ్రతుకును మార్చడానికి కదులుతున్నాడు కదనరంగానికి..


అతడొక సైన్యం..
భావావేశపు సున్నితత్వం, కవుల కలాలు, తమ తలరాతను మార్చలేవని తెలిసి కదులుతున్నాడు కదనరంగానికి..
తమ తరపున గొంతెత్తిన గళాలు మధ్యలోనే ఎందుకు మూగపోయాయే తెలిసి కదులుతున్నాడు కదనరంగానికి..

అతడొక సైన్యం..
తమకు రావలసిన, తనకు కావలసిన పిడికెడు మెతుకుల కోసం కదులుతున్నాడు కదనరంగానికి..
తమ వారికోసం, తన వారికోసం కావాల్సిన దోసెడు గంజికోసం కదులుతున్నాడు కదనరంగానికి..

అతన్నెవరు ఆపలేరు..
బక్క శరీరంపై నాట్యం చేసే లాఠీలు..
తెగిన నరాలపై విహారం చేసే గాయాలు..
శుష్కించిన దేహంలోకి దూసుకెళ్ళే తూటాలు..
కుటిల యుక్తులు, మారణకాండలు,
దమననీతులు, ఏమార్చే మాటలు..
ఇవేవీ అతన్ని ఆపలేవు, ఎందుకంటే ఇప్పుడు అతనొక సైన్యం..

  • Nov 2011
  • 02

మంచి కవిత, ప్రస్తుత పరిస్థితులకు స్పందించిన రీతి బ...

మంచి కవిత, ప్రస్తుత పరిస్థితులకు స్పందించిన రీతి బాగుంది. ఒక్క లైను రాయాలనిపించింది. ఇప్పుడు అతనొక సైన్యం నిలువదు అతనిముందిక దైన్యం! ======== శ్రీనివాస్

  • Jul 2011
  • 05

super and fantastic... its really inspiring to eve...

super and fantastic... its really inspiring to every one .....

  • May 2010
  • 13

chalaaaa bagunnaye keep it up

chalaaaa bagunnayekeep it up

  • Dec 2009
  • 23

హాయ్ ప్రతాప్ గారు ఎప్పుడే మీ బ్లాగ్ చూసాను ...చాలా...

హాయ్ ప్రతాప్ గారు ఎప్పుడే మీ బ్లాగ్ చూసాను ...చాలా బాగావుంది.కవితలు అన్ని బాగావున్నాయీ .మీ బ్లాగ్ డిజైన్ కూడా బాగావుంది ..మీరు ఇలాగే కవితలు పోస్ట్ చేయండి .వుంటాను ...PRANU ...మరచిపోయాను ఫ్రెండ్స్ మీరు

  • Dec 2008
  • 27

mee kavita chaaaalaa bagundandi.

mee kavita chaaaalaa bagundandi.

Followers

తియ్యందనాల తెలుగు.. -