జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అడవి మల్లి

  • ప్రచురించిన సమయం: 11:05:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కథలు

గమనిక:
ఇందులోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కేవలం కల్పితం. ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఈ రచన నా సొంతం. ఎవరైనా వాడినచో చట్టప్రకారం చర్యలు తీసుకోబడును. ఇక చదవండి.
========================================================

అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలా యాభై నిముషాలు..అప్పటివరకు అందరికీ వెలుగును పంచిన సూరీడు విశ్రాంతి కొరకు వేగిరపడుతూ పశ్చిమాన ఉన్న కొండల చాటుకు వెళ్ళిపోతున్నాడు. మేము ప్రయాణిస్తున్న జీపు గుంతల్ని దాటుకుంటూ, గతుకుల్లో ఎగిరెగిరి పడుతూ లేస్తూ దుమ్మురేపుకుంటూ సాగిపోతూ ఉంది. ఆ జీపులో నేను, ప్రసాద్, అభి మరియు రాధిక డ్రైవరు తో కలిపి మొత్తం ఐదుగురున్నాము. మేమంతా మా I.F.S.(Indian Forest Service) ట్రైనింగ్ ముగించుకొని ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇలా నల్లమల్ల అడువుల్లోని మా అటవీశాఖ గెస్ట్ హౌస్ కి బయలుదేరాం.

ప్రసాద్ పేరుకు తగ్గట్లే చాలా సౌమ్యుడు. వాడు నేను చిన్నప్పటినుంచి స్నేహితులం. నేను ఏం చదివితే అదే చదవడం వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు. అదే అలవాటును ఇలా I.F.S. లో కూడా వదలలేదు. ఇక పోతే అభి, వాడు ఆరడుగుల అందగాడు. ఏదో వాడి టైం బావోలేక ఇలా మాలో వచ్చి పడ్డాడు. వాడి గురించి చెప్పుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఇంకోటిఉంది. వాడికి ఏ అమ్మాయన్నా నచ్చితే ఆ అమ్మాయిని కౌగిలిలోకి చేర్చుకోనేవరకు నిద్రపోడు. ఇక రాధిక, తను చాలా ఇంటెలిజెంట్. I.F.S. ఆల్ ఇండియా టాప్ రాంకర్. చాలా డైనమిక్. కాకపోతే ఆ అమ్మాయి బలహీనత వాగుడు. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఇక నా విషయానికొస్తే, నేను కొంచెం భావుకున్ని. కవితలు రాసుకొంటూ, చెట్టూ చేమా వదలకుండా తిరగడం నా హాబీ.

"ఇంకా ఎంతసేపు?" అన్న మా అభి గాడి మాటలతో అలా ప్రకృతిని చూస్తూ పరవశిస్తున్న నాకు ధ్యానభంగమయింది. "ఎంతో దూరం లేదు సారూ. ఇంకా పది నిముషాల్లో చేరుకుంటాం." అన్న మా డ్రైవర్ మాటలతో అందరం ఊపిరి పీల్చుకొన్నాం. అలా గతుకుల రోడ్ల పైన ప్రయాణం చెయ్యాలంటే ఎవరికన్నా విసుగే కదా?

మా డ్రైవర్ చెప్పినట్లే కరెక్ట్ గా పది నిముషాల్లో మా గెస్ట్ హౌస్ ని సమీపించాం. జీపు హారన్ శబ్దం వినగానే ఒక నల్లటి వ్యక్తి పరుగు పరుగున వచ్చి గేటు తీసాడు. మేమంతా జీపు దిగగానే మా డ్రైవరు "రంగయ్యా" అంటూ అతన్ని పిలిచి మమ్మల్నందరినీ పేరు పేరునా పరిచయం చేసాడు. తర్వాత డ్రైవరే మావైపు తిరిగి "సార్లు, ఈయన రంగయ్య. ఇక్కడి వాచ్ మాన్. మీకేం కావాల్సిన ఈయన్ని అడగండి. ఇప్పటికే లేటు అయింది ఇంటికాడ మా ఆవిడ నాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక నేను వెళ్ళొస్తా సార్లు" అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే అభి, "వీడేంట్రా? అందరిని కలిపి సారూ, సారూ అంటాడు?" అనగానే వెంటనే ప్రసాదు అందుకొని "ఈ మేడం(రాధికని చూపిస్తూ) పాంటు-షర్ట్ లో ఉండేసరికి కన్ ఫ్యూజ్ అయ్యుంటాడురా" అనగానే అందరం మనస్పూర్తిగా కలిసి నవ్వుకొన్నాం.నాకు ప్రసాదులో నచ్చేది అదే, ఆ స్పాంటేనియటి. సందర్భానుసారంగా జోకులు వెయ్యడంలో వాడికి వాడే సాటి. ఇక రాధిక ఐతే చెప్పనవసరం లేదు. తన పైన ఎన్ని జోకులు వేసుకున్న అస్సలు పట్టించుకోదు. పైపెచ్చు మాలో కలిసి ఆ జోకుల్ని ఎంజాయ్ చేస్తుంది. తను టాపర్ అన్న అహంభావాన్ని అస్సలు చూపదు. ఇలా మేమందరం ఎంజాయ్ చేస్తూంటే రంగయ్య "మల్లీ" అంటూ ఎవరినో పెద్దగా పిలిచాడు. ఆ పిలుపుకు ప్రతిగా "వత్తున్నా మావా" ఏదో ఒక కోయిల కంఠం వినిపించింది. ఎవరిదీ ఈ కంఠం అనుకొంటూ అందరం కుతూహలంగా అటువైపు తిరిగాం.

అంతే, కళ్ళ ముందర ఓ మెరుపు మెరిసినట్లైంది నాకు. ఆ మెరుపు నెమ్మదిగా ఒక ప్రౌఢ రూపం దిద్దుకొన్నది. పాతకాలం నాటి నేత చీర ఒక్కటే కట్టి, చేతులకు అడవిపుత్రులు వాడేటటువంటి కడియాలు తగిలించి అచ్ఛమైన మల్లి పువ్వు లానే ఉన్నది ఆ మెరుపు.వెంటనే నాలోని కళాకారుడు నిద్రలేచాడు. అయ్యో తన కళ్ళని కాళిదాసు చూడలేదే, చూసుంటే మరో అభిజ్ఞాన శాకుంతలము రాసేవాడేమో. అయ్యో తన ముక్కుని ముక్కుతిమ్మన చూడలేదే, చూసుంటే సత్యభామ ముక్కు బదులు ఈమె ముక్కు గురించి "నానా సూన వితాన వాసనలనానందించు.." అంటూ సాగిపోయేవాడేమో. అయ్యో తన మధునిలయాలను శ్రీనాధుడు చూడలేదే, చూసుంటే శృంగారనైషధం లో నలుని విరహగ్నికి బదులు, తన విరహాగ్నిని లిఖించి వుండేవాడేమో. అంతవరకూ ఎందుకు? నండూరి వారు ఈమెని చూసుంటే ఎంకి బదులు ఈమెని కధానాయికగా పెట్టుకోనేవారేమో అని నాలోని భావుకడు గగ్గోలు పెట్టసాగాడు. కాని నాకు మాత్రం ఈమెని చూడగానే "అడవి మల్లి" అన్న పదప్రయోగం ఎలా వచ్చిందో అర్ధం అయింది. ఇలా నేను సుప్తావస్థలోనుండగా ఎందుకో హఠాత్తుగా అభి వైపు చూసాను. అప్పుడే వాడు నా వైపు తిరిగి చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చూడగానే నాకు అర్ధం అయింది వాడి చూపు ఆ ప్రౌఢ మీద పడిందని నేను ఖచ్ఛితంగా పక్కకి తప్పుకోవాలని.

ఇలా అందరం ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండగా మల్లి రంగయ్య దగ్గరికి వచ్చి నిలబడింది. రంగయ్య తనని మా అందరికి పరిచయం చేస్తూ "సార్లు, నా యింటిది. పేరు మల్లి" అని చెప్పి మల్లి వైపు తిరిగి "ఏంటే అట్టా సూత్తున్నావు? యీల్లు సార్లు. పట్నం నుంచోచ్చారు. తానం సేత్తారు. నీల్లెట్టు" అని పురమాయించాడు. తను అలా వయ్యారంగా నడుస్తూ వెళ్తుంటే నేను, అభి కళ్ళార్పడం మరిచిపోయాము. అలా కాస్సేపట్లో స్నానం మరియు భోజనాలు చేసి అందరం విశ్రాంతి తీసుకుంటామని చెప్పి ఎవరి గదుల్లోకి వాళ్ళు వేళ్ళిపోయాం. నన్ను మాత్రం నిద్రాదేవి వెంటనే కరుణించలేదు. కలల్లో సైతం మల్లి గురించిన ఆలోచనలే. తను, అభి కలిసి అడవిలో విహరిస్తున్నట్లు, జలపాతాల్లో సరిగంగ స్నానాలు చేస్తున్నట్లు. ఇలా ఎన్నో అర్ధంపర్ధం లేని కలలతో తెలతెలవారగా ఎప్పుడో నిద్రపోయాను.

గుడ్ మార్నింగ్ అన్న రాధిక పిలుపుతో నాకు మెలుకువ వచ్చింది. అప్పుడే వినిపిస్తున్న పక్షుల కిలకిలారావాలు, ప్రక్కనే తలస్నానం చేసి తడికురులతో, చేతిలో కాఫీ కప్పుతో నిలబడి, నన్నే చూస్తూ ఉన్న నా ప్రాణస్నేహితురాలు. ఎందుకో ఆ క్షణం నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇటువంటి గుడ్ మార్నింగ్ ఇంతవరకు నేనెరుగను. కాని నా ఈ సంతోషం కొద్దిస్సేపట్లో ఆవిరి అవ్వబోతున్నదని ఆ క్షణం నాకు తెలీదు. "ఏరా! ఇంకా ఎం ఆలోచిస్తున్నావు? లే లే. పద రెడీ అవ్వు. అడవిలోకి వెళ్ళాలి" అన్న తన మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. కాఫీ కప్పు అందుకొని "థాంక్స్" చెప్పి అలా బాల్కనీ లోకి నడిచాను. బాల్కనీ లోంచి మల్లి కనిపిస్తుందేమో అన్న ఆశ తోనే సుమా. కాని ఆ బాల్కనీ లోంచి కనిపించిన దృశ్యం నన్ను కాస్సేపు నిరత్తురుణ్ణి చేసింది.

అక్కడ నాకు కనిపించిన దృశ్యం ఇది, అభిగాడు ఏదో జోక్ వేసినట్లున్నాడు, మల్లి విరగబడి నవ్వుతూ ఉంది. ఆ నవ్వడం కూడా వొళ్ళు తెలియకుండా. ఆ నవ్వులకి తనకు కనువిందు చేస్తున్న మల్లి పయోధరాల కదలికల్ని అభి గాడు చూపులతోనే జుర్రు కొనేస్తున్నాడు. అమ్మో అప్పుడే వీడు రంగంలోకి దిగిపోయాడన్న మాట. ఎలాగైనా సరే, దేవదేవాదులు అడ్డొచ్చినా సరే, మల్లిని నా దారి లోకి తెచ్చుకోవాలని ఆ క్షణమే గట్టిగా ప్రతినబూనాను. కాని రంగంలో అభిగాడు ఉన్నంత వరకు అది అంత సులభం కాదని నాకు తెలుసు. ఇంతలోనే అభిగాడు, "మల్లీ ఇక్కడ ఏదో మంచి జలపాతం ఉందంట కదా? దాన్ని నాక్కొంచెం చూపిస్తావా?" అని అడిగాడు. "ఇక్కడే, దగ్గిరే సారూ. ఓ రెండు పర్లాంగులు ఉంటుంది." అని మల్లీ చెప్పగానే మా అభిగాడు "ఆయితే ఇప్పుడు వెళ్దామా?" అని అడిగాడు. దానికి మల్లి "కాని సారూ, అక్కడ సుడిగుండాలెక్కువ." అనగానే దానికి వీడేమో "పర్లేదులే. నేను మరి ఎక్కువ లోతుకి వెళ్ళను" అన్నాడు. మల్లి "సరే సారూ. మీలు నాస్టా చెయ్యండి. తర్వాత ఎల్దాం." అని చెప్పింది. ఈ సమాధానం వినగానే నాకు స్పృహ తప్పినంత పనైంది. "అమ్మో వీడు కాని ఆ ప్రౌఢతో కలిసి అడివిలోకి వెళ్తే ఏమన్నా వుందా? వీడు ఆ తనని ఊరికే వదిలి పెడుతాడా?" ఈ ఆలోచన రాగానే నేను వెంటనే రంగంలోకి దిగాను. "అభి మనం అంతా కలిసి అడివిలోకి వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు వెళ్తే మనం అడివిలోకి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది." అని నేను బాల్కనీ లోనుంచే అడ్డం పడ్డాను. మా వాడు ఏమన్నా తెలివి తక్కువ వాడా? "పర్లేదు లేరా. దగ్గరే కదా. ఒక అరగంటలో వచ్చేస్తాం. మీరు రెడీ అయ్యేసరికి ఎలాను ఒక గంట పడుతుంది." అని పెద్దగా నాకు వినబడేలా చెప్పి మల్లి వైపు తిరిగి, "మల్లీ! నేనిప్పుడే టిఫిన్ చేసి వస్తా. మనం ఇద్దరం మాత్రమే కలిసి అడివిలోకి వెళ్దాం" అని చెప్పి వాడి రూం లోకి వెళ్ళాడు. "మాత్రమే" అన్న పదం నాకు మాత్రమే వినిపించింది. దానికి అర్ధం తెలియనంత ముర్ఖున్నేమి కాదు. అయిపోయింది. అంతా అయిపోయింది. నాలోని భావకున్ని తట్టి లేపిన నా అడివిమల్లి వేరొకరి సొంతం అయిపోబోతుంది అన్న ఊహ రాగానే నన్నేదో నిస్సత్తువ ఆవరించింది.

ఇంతలోనే మా అభిగాడు రెడీ అయ్యి రావడం మల్లితో కలిసి బయలుదేరడం అంతా నా కళ్ళ ముందరే జరుగుతూంటే నేను కాఫీ తాగడం తప్ప ఇంకేమి చెయ్యలేని నిస్సహాయుణ్ణి అయిపోయాను. వాళ్లు అలా వెళ్ళడం చూసిన రాధిక "ఏంట్రా? అభిగాడు ఏదో పెద్ద ప్లాన్ లో వున్నట్టున్నాడు." అని నన్ను అడగగానే నాకు పుండు మీద కారం రాసినట్లయింది. నా మౌనమే ఆ ప్రశ్నకి సమాధానం అయింది. నా మౌనాన్ని తను పట్టించుకోకుండా, "సరే కానీ, నువ్వు రెడీ అవ్వు. అబ్బ ఈ ప్రసాదు గాన్ని కూడా నిద్ర లేపాలి." అంటూ నేను ఖాళీ చేసిన కాఫీ కప్పు తీసుకొని వెళ్లిపోయింది. తను అలా వెళ్ళడం డ్రైవరు జీపు తీసుకొని రావడం ఒకేసారి జరిగాయి.

ఇంకో అరగంటలో అందరం రెడీ అయ్యి జీపు దగ్గరికి చేరుకున్నాం. అందరం అక్కడికి చేరుకోగానే ప్రసాదు "అభి గాడు ఎక్కడ?" అని నన్ను అడిగాడు. నేను వాడికి జరిగినదంతా చెప్పాను. అంతా విన్న తర్వాత వాడు, "అయినా వాడికి ఈత రాదు కదా? ఇప్పుడు ఎందుకు వెళ్ళాడో?" అనగానే, మా డ్రైవరు "సారూ, అక్కడ భయంకరమైన సుడిగుండాలు ఉంటాయి. అక్కడ ఈతకి దిగడం చాలా ప్రమాదం." అనగానే అందరికీ గుండె ఝల్లుమంది. నేను వెంటనే "నీకు ఆ జలపాతంకి దారి తెలుసా? తెలిస్తే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. తొందరగా." అని అతన్ని హడావుడి పెట్టాను. అతను వెంటనే "రండి సారు, ఎక్కండి" అని అందరం ఎక్కిన తర్వాత జీపుని ముందుకి ఉరికించాడు.

పదినిముషాల్లో ఆ జలపాతం దగ్గరికి అందరం చేరుకొన్నాం. అక్కడ మాకెవ్వరు కనిపించలేదు. అందరూ కంగారుపడ్డారు ఒక్కనేను తప్ప. నేను ఏమైతే అనుకొన్నానో అదే అయింది. అభిగాడు నేను అనుకొన్నంత పని చేసాడు. వీళ్ళ పిచ్చి కాకపొతే వీళ్ళు అంతా నీళ్ళల్లో వెతుకుతున్నారు. వెళ్లి అడవిలో ఉండే పొదల చాటున వెతికితే కన్పిస్తారు అని నా ఆత్మారాముడు ఘోషించడం మొదలు పెట్టాడు. ఇంతలో మా ప్రసాదు గాడు "రేయ్" అంటూ నన్ను పిలిచాడు. "ఏంటి రా?" అన్న నా ప్రశ్నకు బదులుగా "ఇలా రా" అని కళ్ళతోనే సైగచేసాడు. నేను అన్యమనస్కంగా అటువైపు నడిచాను. అక్కడ అభిగాడి బట్టలు, షూ అన్నీ కుప్పగా పడి వున్నాయి. కాని వాళ్ళిద్దరి జాడ మాత్రం లేదు. ఇంతలో మమ్మల్ని చేరుకున్న మా డ్రైవరు, రాధిక వాటిని చూసి కాస్త ఆందోళన పడ్డారు. అందరం కలిసి పెద్దగా "అభీ, అభీ" అంటూ పిలవడం మొదలు పెట్టాము. అంతలో ఆ జలపాతం హోరులో ఎక్కడో లీలగా ఎవరో మూలుగుతున్న శబ్దం నను లీలగా చేరింది. హడావుడి చేస్తున్న మా వాళ్ళందరిని కాస్సేపు నిశ్శబ్దంగా ఉండమని చెప్పి అందరితో కలిసి అటువైపు నడిచాను. అక్కడ మాకు కనిపించిన దృశ్యం మమ్మల్నందరినీ ఊపిరి బిగపట్టేసేలా చేసింది.

అక్కడ.. మా అభిగాడు సుడిగుండంలో చిక్కుకొని ఉన్నాడు. ఆ సుడిగుండం లోని నీళ్ళతో పాటు గిరగిరా తిరుగుతూ "నన్ను కాపాడండి.. హెల్ప్ హెల్ప్.." అంటూ పెద్దగా అరుస్తున్నాడు. కాని ఆ జలపాతం హోరులో వాడి అరుపులు ఎవ్వరికీ వినిపించడం లేదు. కాని ఆ దృశ్యం నన్ను పెద్ద ఆశ్చర్యపరచలేదు. కాకపోతే కాస్సేపు కాళ్ళుచేతులు ఆడకుండా చేసింది. అందరిదీ అదే పరిస్థితి. కాని మల్లి చేస్తున్న పని చూసి మా అందరికి నోట మాట రాలేదు. దేన్నైతే స్త్రీ తన ప్రాణం కన్న ఎక్కువగా భావిస్తుందో ఆ మానాన్ని కుడా లెక్క చేయకుండా తన వొంటి మీద వున్న ఏకైక చీర మొత్తం విప్పి, దాన్ని వాడికేసి విసిరి వాడిని కాపాడేదానికి ప్రయత్నిస్తూ ఉంది. వాడేమో ఆ చీరను పట్టుకొని కూడా భయవిహల్వుడై అరుస్తూనే ఉన్నాడు. మల్లి తన బరువు మొత్తం ఒక రాతిపై వేసి వాడిని ఆ సుడిగుండంలోంచి బయటకు లాగేదానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ ప్రయత్నంలో వాడి బరువు తను మోయలేక,లాగలేక తన శరీరం ఆ రాతికేసి ఒరుసుకొని రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వాణ్ణి కాపాడేదానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఇంతలో మేము తేరుకొని వెళ్లి ఎలాగోలా కష్టపడి వాణ్ణి ఆ సుడిగుండంలోంచి కాపాడేము. బయటకు వచ్చిన అభి షాక్ వల్ల స్పృహ తప్పిపడిపోయాడు.

స్పృహ తప్పిన అభిని వెంటనే జీపులో వేసుకొని అక్కడే వున్న ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాం. ఆ కంగారులో మా అభిగాడిని కాపాడిన మల్లిని అక్కడే వదిలి వచ్చేశాం అన్న సంగతి "మల్లి ఎక్కడ?" అని రాధిక నన్ను అడిగేంత వరకు మాకు ఎవ్వరికీ తట్టలేదు. వెంటనే నేను, ప్రసాదు జీపు వేసుకొని జలపాతం దగ్గరికి వెళ్ళాం. కాని అక్కడ మల్లి లేదు. తర్వాత గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాం. కాని అక్కడ కుడా మల్లి కాని, రంగయ్య కాని ఎవ్వరు కనిపించలేదు.వుస్సూరుమంటూ హాస్పిటల్ కి తిరిగి వచ్చాం. అక్కడ మల్లిని, రంగయ్య ని చుసిన మాకు ప్రాణం కుదుటపడింది. అందరం కలిసి అభి వున్న రూమువైపు నడిచాం. మేం వెళ్ళేసరికి అభి గాడికి స్పృహ వచ్చివుంది. రాధిక ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఉన్నాడు. అప్పుడే రూం లోకి వస్తున్న మల్లిని చూసిన వాడి కళ్లు మెరవడం గమనించాను.కాని ఎందుకో మాత్రం అర్దం కాలేదు. అప్పుడే రూము లోకి వచ్చిన డాక్టరు "ఇక పర్లేదు. షాక్ వల్ల కాస్త స్పృహ తప్పింది. ఇక ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు" అని చెప్పాడు. ఆ మాటలకి అందరం హాయిగా ఉపిరి పీల్చుకొన్నాం. అంతలోనే రాధిక డాక్టరు వైపు తిరిగి, "డాక్టరు గారు, వీడిని కాపాడటంలో ఈ అమ్మాయికి దెబ్బలు తగిలాయి. కాస్త చూడండి" అని అన్నది. "ఏంకాలేదమ్మగోరు" అంటూ మల్లి తప్పించుకోవాలని చూసింది. కాని మేం అందరం తనని వదలలేదు. తనని నేను, రాధిక కలిసి బలవంతంగా డాక్టర్ రూములోకి తీసుకెళ్ళి తన గాయలకి డ్రెస్-అప్ చేయించాము. తనని బయటకు తీసుకు వస్తూ నా మనస్సులో ఉన్న సందేహాలన్నింటిని బయటపెట్టాను.

"మల్లి, మా వాడిని ప్రాణాలకి తెగించి మరీ కాపాడావు. కాని అలా కాకుండా ఇంకెలాగో ఒకలా ప్రయత్నించోచ్చు కదా?" అని అడిగాను. "సారూ, ఇలా రెండేళ్ళ కాడ నా చంటోడు దాంట్లోనే పడ్డాడు. నేను తాడు కోసం చూసేసరికి ఆడు మమ్మల్ని వోగ్గేసిపోయిండు. నాలా మరే తల్లికి వొద్దు. నా చంటోడు పెద్దోడు ఐతే గచ్చు ఆ సారులానే ఉంటడు. అందుకే అట్ట కాపాడినా. సారూ మీరంతా చల్లగుండాలే. మీరంతా చల్లగుండాలే." అంటూ చెమ్మగిల్లిన కనులతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను మాత్రం స్తబ్దుణ్ణి అయ్యాను. తన చెప్పిన మాటల సారాంశం ఇంకా నా చేవుల్లోనే "మీరంతా నా బిడ్డలాంటోళ్ళు!! బిడ్డలాంటోళ్ళు!!" ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇంతలో నా భుజం మీద ఎవరో ఆసరా కోసం చెయ్యి వేశారు. చూద్దును కదా తడి కళ్ళతో అభి. మా మాటలన్నింటిని విన్నట్లు వాడి వాలకమే చెబుతోంది. ఇంతలోనే వాడు నన్ను పట్టుకొని బావురుమన్నాడు. ఓదార్చడానికి ప్రయత్నించబోతున్న ప్రసాదుని, రాధికని చూపులతోనే వారించాను. వాడి మనస్సులోని కల్మషం, నా మనస్సులోని కుత్సితం అంతా మల్లి పునాదుల్తో సహా పెకిలించి వేసింది. కాస్సేపటికి వాడు తేరుకున్నాడు. మా ఇద్దరి చూపులు కలుసుకొన్నాయి. వాడి కళ్ళలోని సంఘర్షణని నేను చూడగలిగాను. ఎందుకంటే ఇంచుమించు నాది అదే పరిస్థితి. ఎవరో చెప్పినట్లు,
జీవితంలో మంచి వ్యక్తిగా స్థిరపడేదానికి,
సంఘర్షణ నాంది..
ఆలోచన పునాది..
వ్యక్తిత్వం భవంతి..
అలాంటి సంఘర్షణతోనే మొదటిఅడుగు వేసి మా ప్రయత్నాన్ని ఆరంభించాం.

అప్పుడప్పుడు..

  • ప్రచురించిన సమయం: 11:45:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

అప్పుడప్పుడు.. గుండెచప్పుడు..
అప్పుడప్పుడు.. ఎద మాటలాడనప్పుడు..
అప్పుడప్పుడు.. కల చెదిరినప్పుడు..
అప్పుడప్పుడు.. కన్నీరు చెలియకట్ట దాటినప్పుడు ..
అప్పుడప్పుడు.. ఏకాంతం నన్నావరించినప్పుడు..
అప్పుడప్పుడు.. జ్ఞాపకాలూ కదిలించినప్పుడు..
అప్పుడప్పుడు.. ఊహలు నను ఊపేసినప్పుడు..
అప్పుడప్పుడు.. మది మూగవోయినప్పుడు..
అప్పుడప్పుడు.. మౌనం నన్నాశ్రయించినప్పుడు..
అప్పుడప్పుడు.. ఆశలు నను కుదిపేసినప్పుడు..
అప్పుడప్పుడు.. నిరాశలు నను ముంచెత్తినప్పుడు..
అప్పుడప్పుడు.. ఏదో మైకం నన్నావహించినప్పుడు..
అప్పుడప్పుడు.. చూపులు నిను వెతికినప్పుడు..
అప్పుడప్పుడు.. ఇలా నీ కోసం ప్రతి క్షణం మరణిస్తూ వున్నా..
అప్పుడప్పుడు.. ఇలా నీవు మిగిల్చిన ఏకాంతంలో బ్రతుకు వెళ్ళదీస్తున్నా..

జ్ఞాపకం

  • ప్రచురించిన సమయం: 12:40:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

జ్ఞాపకాల అరల్ని తవ్వుతూంటే...
ఎక్కడో చూసిన జ్ఞాపకం..
ఎప్పుడో కలసిన జ్ఞాపకం..

ఎన్నడో ఓ నవ్వు రువ్వినా జ్ఞాపకం..
ఎచ్చటో కలసి నడచిన జ్ఞాపకం..
ఎదరినో కలసి ఊసులద్దిన జ్ఞాపకం..

కలల తాలూకు తియ్యదనాన్ని కలసి పంచుకొన్న జ్ఞాపకం..
ఊహాల తాలూకు అనుభూతుల్ని నెమరు వేసుకొన్న జ్ఞాపకం..
కష్టాల తాలూకు బాధల్ని కలసి మోసిన జ్ఞాపకం..

ఇన్ని జ్ఞాపకాల మధ్యన..
నీవు మిగిల్చిన ఒంటరితనపు అనుభూతుల మధ్యన ఏకాకిలా నేను..

అడిగా

  • ప్రచురించిన సమయం: 12:28:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కదిలే కాలాన్నీ కాస్సేపు ఆగమని అడిగా..
నీ సమక్షంలో వున్నప్పుడు..

చెదిరే కలల్ని కాస్సేపు వుండమని అడిగా..
నీవు నా స్వప్నాలలో విహరిస్తున్నప్పుడు..

ఎగిసే అలల్ని కాస్సేపు అలానే వుండమని అడిగా..
నీ ఊహల జ్ఞాపకాలని అవి మోస్తూ ఉంటే..

పున్నమిరాజుని అడిగా ఎప్పటికి అలానే వెన్నెల చిందించమని..
నీ మోములో వెన్నెల తాలూకు అవ్యక్తానుభూతి గోచరిస్తూ ఉంటే..

తళుక్కున మెరిసే తారకలని అడిగా..
నీ దరహాసాల తలుకుల్ని అవి మురిపిస్తూ ఉంటే..

ఎగిరే విహంగాలని, రెక్కల్ని ఇవ్వమని అడిగా..
నీ దరి చేరాలని మనసు తొందర పెడుతూంటే...

హోయలోలికే స్రవంతుల్ని అడిగా..
నీ హోయల్ని చూసి హొయలు వెల్లబోయమని.. వెలవెలబొమ్మని..

భావం.. అంతా నీ రూపం..

  • ప్రచురించిన సమయం: 12:25:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

నాకు అత్యంత సామీప్యాన నువ్వున్నావన్న భావం..
కాని అందనంత దూరంలో మాత్రం నీ రూపం..

ఊహల్లో, నీ సన్నిధిలో నే సేదదీరే సమయం..
క్షణమైనా మూయని నా కన్నులనిండుగా నీ రూపం..
సడి చెయ్యని నా ఎద నిండా నీ ద్యానం..

ఊసుల్లొ, నీ సమక్షంలో నే విశ్రమించే నిముషం..
నీ స్వసలోని పరిమళాలని..
నీ చుపులోని ఆత్మీయ భావలలని..
నీ స్పర్శలోని వెచ్చదనాలని..
నా మది నిండా పదిల పరుచుకొన్నా..

నిరీక్షణ

  • ప్రచురించిన సమయం: 12:15:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

ప్రతిరోజూ నీకై నే నిరీక్షిస్తూ ఉంటాను కదా??
అయినా ఊహల్లొ తప్ప వాస్తవిక జగత్తులో కనిపించని నువ్వు!!
నడి రేయి సడి చేయక ఏతెంచి..
కలుత నిద్దురలోని నా కన్నులకు నీ ఊహల పరిమళాలను అద్దుతావు!!
ప్రతి నిముషం నీకై నిరిక్షించే నా మదిని నీ జ్ఞాపకాలతో నింపుతావు!!
నీ ఊహల జ్ఞాపకాలలో తడిచి నేను ముత్యమై ప్రకాశిస్తున్నా!!
నీ కోసం స్వచ్ఛంగా నేను అచ్ఛంగా ఎప్పటికీ ఎదురు చూస్తూనేఉంటా!!

సవ్వడి

  • ప్రచురించిన సమయం: 12:02:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

చిరుగాలి చిరు సవ్వడి చేసినా చాలు..
అది నీ పాదాల సవ్వడేమోనని..
నాలో చిన్న అలజడి!!

గుడిగంటలు చిరు ధ్వని చేసినా చాలు..
అది నీ మువ్వల సవ్వడేమోనని..
నాలో చిన్న ప్రతిధ్వని!!

పువ్వులు చిరు వయ్యారాలు పోయినా చాలు..
అది నీ నడకల హొయలేమోనని..
నా చిన్ని గుండెలో చిరు హొరు!!

పిల్ల తుమ్మెర అల్లరిగా నా శ్రవణాన్ని సృశిస్తే..
అది నీ శ్వాస తాలూకు స్పర్శ ఏమోనని..
నా మనస్సులో చిన్న కదలిక..

పల్లె పడుచుల రవళిని నీ అందెలరవళి ఏమోనని..
పరవసించి పాడే కోయిల పాటలని నీ మాటలేమోనని..
ఉషఃకిరణాల ఉషఃస్సులో మెరిసే తుషారబిందువుని చూసి..
నీ ముక్కేరేమోనని ముచ్చట పడుతున్నా..

నీరాజనం

  • ప్రచురించిన సమయం: 11:34:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

మౌనమా.. మౌనమా..
మాటలకందని మధుర భావమా..

స్వప్నమా.. స్వప్నమా..
చేతలకందని సుమధుర జాలమా..

నిశ్శబ్ధమా.. నిశ్శబ్ధమా..
ఊహలకందని సుందర కావ్యమా..

చైత్రమా.. చైత్రమా...
చిత్తరువులా నిలిచే అద్భుతచిత్రమా..

ప్రాణమా.. ప్రాణమా..
నా ఊహల్లో ఊపిరోసుకున్న నా ప్రాణమా..
అందుకో నా ఈ నీరాజనం..

నా పదాలు..

  • ప్రచురించిన సమయం: 11:30:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

సూరీని దాటిన నీ కిరణాలు..
నీ అందెలను స్పృశించెనులే నా చరణాలు..

చందురిని దాటిన నీ పాదాలు..
నీ మువ్వలను ముద్దెడినులే నా పదాలు..
నే...
మెరుపై..
ఉరుమై..
చినుకై..
విల్లై..
హరివిల్లై..
నీ మేని మెరుపై..
..ఎప్పటికి ఉండనా??

ఈ క్షణం ఒకే ఒక ఆశ..

  • ప్రచురించిన సమయం: 10:59:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

ఈ క్షణం ఒకేఒక ఆశ..
నీ స్వరం వినాలని తీయగా..

ఈ నిముషం ఒకేఒక ఆశ..
నీ సామీప్యాన వుండాలని హాయిగా..

ఈ ఘడియ ఒకేఒక ఆశ..
నీ చెంతనే నడవాలని మనసారా..

ఈ క్షణం ఒకేఒక ఆశ..
నీ రూపం చూడాలని తనివితీరా..

ఎప్పుడూ.. గుండెచప్పుడూ.. ఎప్పుడూ.. ఒక తలంపు..
నిను వదలలేకుండా వుండలేనని నా మదిని కలవర పెడుతూంటే..
ఎప్పుడూ.. మదిచప్పుడూ.. ఎప్పుడూ.. ఒక మదింపు..
నిను చూడలేకుండా ఉండలేనని నా హృదిన అలజడి రేపుతూంటే..
నా నయనమెటు??
నీ పయనమెటు??

- Inspired by ఈ క్షణం ఒకే ఒక ఆశ song..

ఆకాశం.. నీకోసం..

  • ప్రచురించిన సమయం: 10:57:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

ఆకాశం మబ్బుల పందిరి వేసింది..
నీకోసం మేఘాల పల్లకి పంపింది..
తనతో నిను రమ్మని..
అదిగో నను చూడమని..
అల్లరిగా హరివిల్లుల రవళి వేసింది..

ఆకాశం తనకోసం ఒక చందురుని వుంచెనులే..
ఆకాశం నాకోసం మరొక చందురుని ఇల పైకి పంపెనులే..
తనకు నీ నవ్వులే ఇవ్వమని..
ఇదిగో నీ నవ్వుల తారకలను అడగమని..
అందంగా తారకలని అడిగింది..

వయ్యారాలు పోయే మేఘమాలికలని..
నయగారాలు పోయే రాజహంసలని..
నీతో నడవమని..
నడకల హొయ్యారాలు నేర్వమని..
ఆకాశం.. నీకోసం..
కరిగిందిలే.. కరిగి..
చినుకుగా మారి.. వరదై పొంగి..
ప్రతి చినుకుతో నిను స్పృశించాలని చూసి..
చేతకాక.. తాళలేక..
బాధపడుతూ..
ఆకాశం.. నీకోసం.. ఎర్రబడిందిలే..
ఎందుకో.. ఏమిటో..
ఆకాశం.. నీకోసం.. ఎర్రబడిందిలే..

అతివ

  • ప్రచురించిన సమయం: 10:09:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

మెరిసే కళ్ళలోన..
కురిసే పూల వాన..
వాలే సోగ కళ్ళలోన..
విరిసే సిగ్గుల వాన..

చూసే ఓర చూపులోన..
కదిలే భావాల నావ..
చిందే దరహాసాలలోన..
కురిసే అతిశయాల భావన..

నివేదన

  • ప్రచురించిన సమయం: 9:59:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

ప్రతి నిశిరాత్రి..
ఊహలు ఊపిరి పోసుకొంటున్న వేళ..
స్వప్నాల తలపులు విచ్చుకొంటున్న సమయాన..
మెల్లగా నా ఎద తలుపులు తెరుచుకొంటున్న వేళ..

అదిగో..ఎక్కడో..
లీలగా..మెల్లగా..
నీ అడుగుల సవ్వడి..

వెన్నెల తాలుకు శరదృతువులలో..
వింజామరలా వీస్తున్న గాలిని సైతం..
నీ మేని పరిమళం ఆపేస్తూ వుంది..

వేసవి తాలూకు వసంతఋతువులలో..
తీయగా వినిపిస్తున్న కోయిల పాటని సైతం..
నీ స్వరం చిన్నబుచ్చుతోన్నది..

ఆనందాల సంబరాలు, అంబరాన్ని అంటే వేళ
కూడా..
విషాద ఛాయలు, పాతాళాన్ని చూపే వేళ..
కూడా..
నోట నీ పేరే పలుకుతున్నా..
నీ ఊహల్లొ బ్రతుకుతున్నా..

అన్ని నీ కోసమే

  • ప్రచురించిన సమయం: 12:08:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

నింగి అంచులవేరకు వెళ్ళా..
నీవు నాకు కనిపించనపుడు..

హరివిల్లును విల్లులా వంచా..
నీ మోములో దరహాసం మాయమయినప్పుడు..

నేల నింగి కలిసే వరకు వెళ్ళా..
నీ కోరిక తీర్చాలి అనుకొన్నప్పుడు..

శిలని శిల్పంలా మలిచా..
నీ రూపం నా మదిలో మెదులుతూన్నప్పుడు..

విరులకు నా అంత అదృష్టం లేదని తెలిపా..
నీ కురులు నా మోముపై కదులుతూన్నప్పుడు..

నీకోసం -2

  • ప్రచురించిన సమయం: 12:07:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

గుండె గూటిన దాగిన నా సామ్రాగ్ఞి..
ఎదలోయల నిండిన నా చిత్రాగ్ఞి..
నీ ఊహ కోసం ఊపిరి నయ్యెద..
నీ స్వేదం కోసం కాచే ఎండ నయ్యెద..
నీ కురుల కోసం పూచే పువ్వు నయ్యెద..
నీ సిరుల కోసం వీచే సమీరమయ్యెద..
నీ ఆనందం కోసం రాలే చినుకు నయ్యెద..

కాలమా.. కాస్సేపు ఆగుమా..

  • ప్రచురించిన సమయం: 12:01:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కాలమా, కాస్సేపు నిలువుమా..
సమయమా, కాస్సేపు ఆగుమా..
క్షణమా, కాస్సేపు నిరీక్షించుమా..
నిముషమా, కాస్సేపు అనిమేషమై వుండుమా..

ఓ కరిగి పోవు కాలమా..
తన ఊహల్లో నను బంధింపుమా..
ఓ ఆగని సమయమా..
తన జ్ఞాపకాల సంద్రంలో నను నింపుమా..
ఓ నాకోసం నిరీక్షించని క్షణమా..
తన రెప్పల మాటున నను క్షణమైనా చిత్రించుమా..

నీకోసం

  • ప్రచురించిన సమయం: 11:55:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

శ్వాస గతి తప్పుతూ వున్నది..
ధ్యాస మతి తప్పుతూ వున్నది..
నయనాలు నలు దిక్కులా వెతుకుతున్నాయి..
చరణాలు పలు దిక్కులా ప్రతి ధ్వనిస్తున్నాయి..

నా తపం నీ కోసం..
నా జపం నీ కోసం..
నీ ఆనందం నా కోసం..
నా భాధ నీ కోసం..
అందాల ఈ మన్ను నీ కోసం..
అద్భుతాల ఆ మిన్ను నీ కోసం..

నీ కోసం ఇలా చెయ్యనా??

  • ప్రచురించిన సమయం: 11:45:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

నింగికి నేలకి చినుకుల వారధి వెయ్యనా??
నువు నాకోసం నేల పైకి నడచి వస్తానంటే..
దివికి భువికి హరివిల్లుల వంతెన కట్టనా??
నువు నాకోసం ఇల పైకి దిగివస్తానంటే..

అందాల జాబిల్లిని తుంచి నీ సిగలో తురమనా??
నువు నా చెంత వుంటానంటే..
చుక్కలన్నీ తెచ్చి నీ పానుపునై వెదజల్లనా??
నువు నా వెంట వుంటానంటే..

ఎందుకు??

  • ప్రచురించిన సమయం: 11:44:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

అందని కలల కోసం ఆ ఆరాటమెందుకు??
స్వప్నం సుదూరమని తెలిసి ఆ పరుగులెందుకు??

వెంబడి నడిచి వచ్చే నీడ కరుగక వుండునా??
కాంతి అందించే దీపం కూడా తరుగక మిగులునా??
సంతోషం పంచే నీ సన్నిధి బాధ పంచక మానునా??

ఊహలు వాస్తవాలు కావని తెలిసి వాటిలో తడవటం ఎందులకు??
ఎక్కి వచ్చే ఏడుపు నాపుట ఎవరి తరం??
సంద్రంలా పొంగే కన్నీళ్ళనాపుట ఎవరికి సాధ్యం??

స్నేహానికి ప్రతిరూపం

  • ప్రచురించిన సమయం: 11:30:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

నేస్తమా.. నేస్తమా..
లాలించే అమ్మవు నీవై..
పాలించే నాన్నవు నీవై..
నీ గుండెల్లో నిలిపావు నను భద్రంగా..

స్వప్నాల ఈ జగత్తులో..
దారేదో తెలియని ఈ లోకంలో..
నను నడిపించావు గారంగా..

అరుణిమ దాల్చిన ఆకసంలా..
రుధిరం దాచుకొన్న అగ్నిలా..
వున్న నను,
నీ మాటలతో చేసావు హిమంలా..

ఆలోచనల హారం ధరించి..
బాధా సుడిగుండాలలో చిక్కి..
వున్న నను,
నీ చేతలతో చేసావు హాయిగా..

నా ఒంటరి జీవితపు పుస్తకంలో..
నే తెరిచే ప్రతి పుటలలో..
నే వెదికే,
నా కవితా భావజాలపు ప్రతి అక్షరం నీవే సుమా!!

నా గుండె చేసే చిరు సవ్వడిలో..
నా కంటి నీరవపు నిశబ్దంలో..
నిశరాత్రి, కటిక చీకటిలో..
నా నీడ నను వీడిపొయినా..
నా వెంట వుండే భావన నీవే సుమా!!

నే సంతోషం పొందే వేళ..
నను అందరు అభినందించే వేళ..
నా నయనాలు వెతికేది..
ఎక్కడో దాగి, నా విజయాన్ని..
నా కన్నా ఎక్కువగా ఆస్వాదించే నిన్నే సుమా!!

నేస్తమా.. నేస్తమా..
నను ఎప్పటికి వదలకుమా..
నేస్తమా.. నేస్తమా..
నను ఎన్నటికీ వీడకుమా..

నిన్నే తలుస్తున్నా

  • ప్రచురించిన సమయం: 10:25:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

ఉషఃకాంత ఉషఃస్సులా..
నీరవకాంత నిశ్శబ్దంలా..
తుషారబిందువు స్వచ్ఛతలా..
రేరాజు కిరణాల తీవ్రతలా..
నెలరాజు మోములోని దరహాసంలా..
వసంత కాలపు గడుసుదనంలా..

కోయిల గానంకే పేరు పెట్టేలా..
నేలవంకకు వంక పెట్టేలా..
వున్న నీ సొగస్సు చూసి..
నిద్దురలో కూడా నిను తలచి..
కలలో కూడా నిన్నే పిలిచి..
వుహలలో కూడా నిను వలచి..
వాస్తవాలకు కడగండ్లు మిగిల్చి..
నను నేను మరిచి..
జ్ఞాపకాల దొంతరలో నిను పదిలంగా దాచుకోంటున్నా..
కృష్ణపక్షపు జాబిల్లిలా నిను అపురూపంగా చూసుకొంటున్నా..

భావ ఝరంపరి

  • ప్రచురించిన సమయం: 10:13:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

సరసస్వర సుర చరీతం, నీ గీతం..
ఘరజఝ్వర నీలా హాలాహలం, నీ భావం..
అషమధ్వర లీలా సురాపానం, నీ నామం..
అభినందన మందారహారం, నీ తాపం..
సుల జజ్జల చంచల చిత్రం, నీ రూపం..
విర జాజుల సంచలన సిత్రం, నీ అధరం..
అవిలాల్విల అవ్యక్తభావం, నీ పయోధరం..
చర విర పుర మధుర విరహం, నీ గానం..
మధురం..సుమధురం..విరిసిన నీ అధరం..

ఎవరు నీవు?

  • ప్రచురించిన సమయం: 3:27:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

మనస్సు ముంగిట నిలిచిన రంగవల్లివా??
వయస్సు వాకిట విరిసిన సుమవల్లివా??
వెన్నెలలా మెరిసే అన్నుల మిన్నుల కన్నులవా??
కన్నుల నిండా నిండిన వెన్నెల చిన్నియవా??
సుమగంధాలు వెదజల్లే మరుమల్లియవా??
వసంతాలు చిందించే ఆమనివా??
కమ్మని కోయిల రాగ కుజితానివా??
స్వరాల హారాల రాగ మల్లికవా??
నీతపు సుతి మెత్తని స్పర్శల కన్నియవా??

ఇలా చెయ్యనా??

  • ప్రచురించిన సమయం: 3:17:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కన్నీరుని దోసిలితో పట్టి..
నీ పాదాలను అభిషేకించనా??

నవ్వుల పువ్వుల్ని ఏరి..
సుమగుచ్ఛంగా మార్చి అందించనా ??

వెన్నెల కులుకుల్ని కన్నులనిండా నింపి..
మిన్నుకు సైతం అందకుండా నీకే అందించనా??

తారకల మిణుకుల్ని ఏర్చికూర్చి పేర్చి..
నీ జడవంపులో తురమనా??

హృదయ భావజాలన్ని ఎద బీజాక్షరాలుగా మార్చి..
నీ మనో ఫలకం పై లిఖించనా??

జీవిత చరమాంకంలో..
నీ ఒడిలో తల వాల్చి ఈ జీవితాన్నిక ముగించనా??

ఎందులకీ

  • ప్రచురించిన సమయం: 3:16:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కన్నులకెందుకు ఈ కలవరం..
మదిలో ఎందుకు ఈ కలకలం..
ఎదలో ఎందుకు ఈ పరవశం..

నా మది నా మాట విననంటూవుంది..
నా నయనాలు నీకై వెతుకుతూ వున్నాయి..
నా పాదాల పయనాలు నీ సామీప్యం వైపే..

కమ్మని నా కలల సామ్రాగ్ఞి ..
ఆశల ఇలవేణి..
భావావేశాల కలబోణి..
అందుకోవా నా వూహల కౌగిలిని..

కడసారి..

  • ప్రచురించిన సమయం: 3:02:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

నా దేహం శిధిలమవుతూ వున్నది..
అయినా నీ జాడ లేదు.
నా శ్వాస ఆగి పోవుచూ వున్నది..
అయినా నీ ధ్యాస నను వీడ లేదు..

నా తలంపులలో నిలిచిన ప్రియ నేస్తమా,
కడసారయినా కన్నీటి వీడ్కోలు ఇవ్వగలవా??
నా ఎదలో కొలువై వున్న ప్రాణసఖి,
చివరిసారయినా కన్నులకు అదృష్టాన్ని ప్రసాదిస్తావా??

ఎన్నో..

  • ప్రచురించిన సమయం: 3:01:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కనిపించని కలలెన్నో..
తీరాన్ని తాకని అలలెన్నో..

వినిపించని స్వరాలెన్నో..
విపంచి ఒలికించని రాగాలెన్నో..

కంటి నుంచి జాలువారిన కన్నీటిచినుకులెన్నో..
కనుపాప మోయలేని నిశిరాత్రి కునుకులెన్నో..

శ్వాస తీయని క్షణాలెన్నో..
ధ్యాస తప్పించే తలంపులెన్నో..

పెదవి మాటున దాగిన మాటలెన్నో..
పెదవి పై నిలిచిన మౌనాలెన్నో..

మౌనం చాటున ఆగిన పలుకులెన్నో..
నను నే మరచిన ఘడియలెన్నో..

అనుకొన్నా.. నీవేనని తెలుసుకొన్నా..

  • ప్రచురించిన సమయం: 1:51:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

వీనుల విందుగా వీణానాదం వినిపిస్తే ఎమిటో అనుకొన్నా..
అది నీ పలుకుల మహాత్యమేనని ఇప్పుడే తెలుసుకొన్నా..

కన్నులముందుగా మువ్వలపాదం కనిపిస్తే ఎవరిదో అనుకొన్నా..
అది నీ సుతిమెత్తని అడుగుల సవ్వడేనని ఇప్పుడే క్రొంగొత్తగా కనుగున్నా ..

నాసిక మెండుగా సుగంధ సుమభరిత పరిమళం మెదిలితే ఏమో అనుకొన్నా..
అది నీ మేని పరిమళమేనని ఇదిగో ఇప్పుడే తెలుసుకొన్నా..

పలికే పెదవే తియ్యనితే, ఏమైంది నాకు అని అనుకొన్నా..
పిలిచింది నీ పెరేనని,
తలచింది నిన్నేనని ఇప్పుడే తెలుసుకొన్నా.. తెలుసుకొన్నా..

మది.. వెతల పెన్నిధి

  • ప్రచురించిన సమయం: 1:49:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

సమయం చాలని స్వప్నమిది..
గమ్యం లేని పయనమిది..
ఉదయం చూడని అకసమిది..
ఇది.. ఇది... నా వెతల మది..

నీరవ నిస్సబ్దపు నిశీధి లో,
నా కంటి పాప సాక్షిగా జాలు వారిన..
కన్నీటి వ్యధా భరితపు,
జ్వలాపూరితపు పరితప్త నివేదన..
వినేదెవ్వరు?

నిరాశపు వడగండ్లలో..
నిట్టూర్పుల జడి వానలో..
నీ నామ స్మరణ తప్ప ఇంకేమి తెలియని
జీవచ్ఛవంలా వున్న నా ఎద పరివేదన..
ఆలకించేదెవ్వరు??

తెలుసునా??

  • ప్రచురించిన సమయం: 1:33:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

చెక్కిలిన జాలువారే కన్నీటి రాకకు..
కారణం ఎమిటో చెక్కిలికి తెలుసునా??

మౌనం మాటున దాగిన మాటలకు..
అర్ధాలేమిటో అధరాలు తెలుపునా??

బాధకు.. చెమ్మగిల్లే నయనాలకు..
సంభంధం ఎమిటో తెలుసునా??

ప్రయత్నపు మాటున అప్రయత్నంగా..
దాగిన సరాగాల సుస్వరం వినేదెవ్వరు??

ఏదరినో.. ఎందరినో.. తాకిన..
ఉషఃస్సు నా దరికి చేరదెందుకు??

కలకూజితం కాని సుస్వరం ఎందులకు??
మోడు వారిన జీవితం ఎందులకు??

నీ వల్ల..

  • ప్రచురించిన సమయం: 1:04:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కంటికి కునుకు దూరం...
పెదవికి పలుకు భారం..
ఎదలో ఊహల పరవశం..
మదిలో తలపుల కలవరం..

మనస్సును చేరిన చూపుల శరంపరం..
హృది సంద్రంలో ఎగసిన అలజడుల శరధ్వరం.
తిమిరపు మోములో కూడా వెల్లివిరిసే అతిశయం..
సమిరపు చల్లదనాల కలకూజితం..

కంటి రూపులో..
వంటి మెరుపులో..
పెదవి విరుపులో..
దృశ్యపు మైమరపులో..
సద్రుశ్యపు అదృశ్య భావనల తామర తుంపరపు విరిపరంపరలా...

వందనం

  • ప్రచురించిన సమయం: 12:57:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

ముగ్ధలా ఒదిగిన మౌనమా నీకు వందనం...
ఆధారాలు దాటని నీ నవ్వులకు అభివందనం..

సిగ్గుతో వాలిన సోగ కన్నులకు మందాలహారం..
సడి చేయని నీ నడకలకు నా నీరాజనం..

సన్నిధిలో శ్వాస మరచిన తనువునకు చుంభాభివందనం..
పెన్నిధిలో ధ్యాస తప్పిన ఎద పదనిసలకు మౌనాభివందనం..

చూపులతో కైవారాన్ని ఎదలో దింపే నయనాలకి పాదాభివందనం..
వుహలతో ఊయ్యలూపే నీ తలపులకి కుసుమాభివందనం..

ఎందులకు??

  • ప్రచురించిన సమయం: 12:45:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

ఎద వేదన నివేదించలేని..
కన్నులకే ఎందుకు కన్నీరు???
మది యాతన తెలుపలేని..
ఆధరాలే ఎందుకు వణికేను ???
భావాలను అందించలేని..
పయోధరాలకు ఎందుకీ మౌనం???

కను రెప్పల మాటున దాగిన సత్యమిది..
శ్వాస మరచిన ఎద చాటున వున్న ద్రుశ్యమిది..
ధ్యాస తప్పిన మది మాటున నిలిచిన జగత్తు ఇది..

తను..

  • ప్రచురించిన సమయం: 12:10:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కనుపాప దాటని చూపుల్లో..
పెదవి దాటని మాటల్లో..
శ్వాస ఆగిన క్షణాల్లో..
ధ్యాస తప్పిన నిమిషంలో..
తెలియని బాసలను మోసే స్పర్శల్లో..
తన పేరే వినిపించే శ్రవణాల్లో..
సింధువులా మారే బిందువుల్లో..
సంద్రంలా మారే కన్నీరులో..
వ్యధను మోసే ఎదలో..

ఇలా..
అలా..
ఎచట..
కన్నా తన రూపమే..
ఏచోట..
విన్నా తన నామమే..

నీతో..

  • ప్రచురించిన సమయం: 11:55:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కలల జీవితం మాని నీతో అలలాంటి జీవితం పంచుకోఅవాలని వుంది..
శిలలాంటి బ్రతుకుని వదిలి నీతో పూలలాంటి జీవితం గడపాలని వుంది..
అభిజాత్యపు మనుషుల్ని మరిచి నీ నీడను చేరుకోఅవాలని వుంది..
అధికారపు దర్పాల్ని ఏమార్చి నీ దరిని విశ్రమించాలని వుంది..
నిర్దయపు ఈ జగత్తును వీడి నీ సామీప్యాన నిద్రపోవాలని వుంది..
ప్రతి పదనిసల ప్రతిబంధకాలను బంధించి నీ జతను అందుకోఅవాలని వుంది..
నిరర్ధక, నిస్సహేతుక, నిరాధారాలన్నింటిని నిర్భందించి నీ అనురాగాలన్నింటిని చవిచూడాలనివుంది..

కానీ.. ఇవన్నీ..
ఎప్పటి నిశిరాత్రి నిశబ్దపు కలలు??
ఏనాటి కాళరాత్రి కమ్మని కోరికలు?
ఎన్ని పురివిప్పని నా ఆశల ఊహలు??

వేదన

  • ప్రచురించిన సమయం: 5:49:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కల చెదురుతూ.. కన్నీరు చిదుముతున్న వేళ..
కంటిపాప బెదురుతూ.. కంటికెదురుగా వున్న స్వప్నం కనుమరుగవుతున్న వేళ..
అలలా మెదులుతూ.. మస్తిష్కంలో ఆలోచనలు ముప్పిరుగొంటున్న వేళ..
శిలలా చెదురుతూ.. అన్యమనస్కపు ఆక్రోశాలు ముసురుకొంటున్న వేళ..
ఎక్కడో దూరంగా నిశీధి నీరవంలో ఒక పువ్వు విచ్చుకొంటున్న వేళ..
ఎచ్చటో మరోచోట ఇంకో పువ్వు రాలి పోవడానికి సిద్దమవుతున్న వేళ..

ఇంతటి వేదనలో కుడా..
నా కెదురుగానున్నచిత్తరువు నీవు..
నా కంటిపాపలో దాగిన చిత్రం నీవు..
నా ఎదలో నిలిచినది నీవు..
నా మది మరువనిది నిన్ను..

కంటిపాప స్వప్నం నీవని..
నిద్దుర పోనివ్వని కమ్మని జ్ఞాపకం నీవని..
అలవికాని నా ఆలోచనల అంతరంగ మధనాలు..
నిలవనియ్యని నీ ఆలాపనల సరిగంగ మధురిమలు..

ఎన్నటివీ జ్ఞాపకాలు??
ఎప్పటివీ ఆలోచనలు??
ఎక్కడివీ ఆలాపనలు??

నిన్నే తలుస్తున్నా

  • ప్రచురించిన సమయం: 5:44:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కనుల నిండా నిను నింపుకొని...
ఊపిరి నిండా నీ శ్వాసను ఒంపుకొని...
ఎద నిండా నీ పై ప్రేమ పరుచుకొని...
మది నిండా నీ ఊహలు పేర్చుకొని..
నోరారా నీ నామాన్ని జపిస్తూ...
ప్రతి తలంపులో నిన్నే వెతుక్కొంటూ...
ప్రతి తలపులో నిన్నే చూసుకొంటూ..
అను క్షణం నీకోసమే తపిస్తున్నా...
ప్రతి నిముషం నీకోసమే జీవిస్తున్నా...

నీ కోసం..

  • ప్రచురించిన సమయం: 5:40:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

హృది చుట్టూ పరుచుకొన్న తలపుల సామ్రాజ్యంలో విహరిస్తున్నా..
అచట నే కట్టిన నీ ఊహాసౌధాలకి కాపలా కాస్తున్నా..
ఎద చుట్టూ అల్లుకొన్న మరో లోకంలో విశ్రమిస్తున్నా..
అచట నే పట్టిన నీ జ్ఞాపకాల దొంతరలని పేర్చుకొంటున్నా..
మనో ప్రాంగణంలో నీ చెలిమి కోసం ఎదురు చూస్తున్నా..
అచట గుండె తలుపుల మాటున నీ కోసం నిరీక్షిస్తున్నా..

నువ్వే…

  • ప్రచురించిన సమయం: 5:36:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కాలం కథను మార్చినా..
వాలం ఎదను గ్రుచ్ఛినా..
మరపు రాని మధురిమ నువ్వు..

కమ్మని విరిసిన కల చిమ్మని విషం చ్రిమ్మినా..
ఝుమ్మని ఎగిసిన అల చిక్కని నిశీధం చూపినా..
మదిలో మెదిలే మాళవిక నువ్వు..

చేజారిన జీవితం వ్రెక్కిరించినా..
వేసార్పుల విరహగీతం వర్షించినా..
మరువలేని జ్ఞాపకం నువ్వు..

నా మజిలీ..

  • ప్రచురించిన సమయం: 5:22:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

తలపుల నావలో నా ప్రయాణం నీ దరికి..
ఊహల త్రోవలో నా ప్రయాణం నీ దారికే..
కలలు మాననంటున్న నా అక్షువుల మజిలీ నీ పైకి..
ఎద సవ్వడిలోను నీ పదముల సవ్వడేమోనని నా మది వురికే..

కాని..
కలకుజితాల స్వరాన్ని దాటి మాట రాదెందుకని??
విలతుజితాల చూపుల్ని దాటి శ్వాస నిలవదేందుకని??

అశ్రుతప్త నయనం..
వ్యధాభరిత హృదయం..
వేదోతప్త వదనం..
నిరాశాపూరిత గమనం..
వీటన్నిటిలోనూ కుడా నా చివరి మజిలీ నీవే..