జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అన్వేషణ

  • ప్రచురించిన సమయం: 5:16:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


ఆలోచనల అనంత సాగర గర్భాన నిలుచుంటావు..
సులోచనల రెప్పల మాటున సిత్రమై దాగుండిపోతావు..
అంతులేని ఊహల మేఘమాలికలలో పవళించిపోతావు..
పొంతన లేని కలలా కడలి కెరటమై నను ముంచెత్తుతావు..
సైతకసీమల్లో శిలలా నిలిచి నను మైమరచుతావు..
ప్రతిరోజూ నిన్నటి కలలా మిగిలి నను ఏకాంతంలో నిలిపేస్తావు..
నేడు రేపయ్యేలోగానే నను ఊహల్లో నిలిపి, నిన్నటి స్వప్నంలా మిగిలిపోతావు..

మొన్నటి జ్ఞాపకంలా నను చేరి..
నిన్నటి కలలా నేటి ఊసుల్లోకి మారి..
నేటి తలపులా ఎదలోకి జారి..
రేపటి ఊహలా కంటిపాపలోకి దూరి..
నిత్యం నను మాయచేసి నా మది పరదా చాటున నీలినీడలా పరుండిపోతావు..

2 people have left comments

బొల్లోజు బాబా said:

ప్రతాప్ గారూ
లైట్ గా తీస్కోండి
ఈ కవితలో మీ మార్కు సరళత కనిపించలెదు.
పవళించిపోతావు అనె పదం ప్రాసకోసం వేసిందైనా అర్ధం అంత అర్ధవంతంగా అనిపించలెదు.
అదేవిధంగా మైమరచుతావు అనె క్రియకు కర్త ఎవరో అస్ఫష్టంగా ఉంది.
నిన్న నేదు రేపు పదాలతో ఆడుకున్నారు.
అలాగే
జ్ఞాపకం, ఊసు , తలపు, ఊహ అనే పదాలతో కూడా

మొత్తానికి మీ కవిత బుర్రకు పదును పెట్టేదిలా ఉంది.

కొసమెరుపు:
ఫొటో బాగుంది.
నా వళ్ళొ కూర్చున్న మా అబ్బాయి (మూడేళ్లు వాడికి) ఆ ఫొటోలో అన్నయ్య ఏం చేస్తున్నాడు అని అడిగాడు. ఈ గొడవంతా ఎందుకులే అని అటుతిరిగి హోం వర్కు చేసుకుంటున్నాడు అని చెప్పాను. పుస్తకం కనపడటం లేదు ఇటుతిరిగి చేసుకోమను అని గొడవచేసాడు.
ఏమనాలో అర్ధం కాలేదు.

బొల్లోజు బాబా

ప్రతాప్ said:

బాబా గారు,
మీరన్నది నిజమే కావొచ్చు. ఈ కవిత దాదాపు 3 సం" క్రితం రాసాను. కాకపొతే ఇప్పుడు ఎందుకో పోస్ట్ చెయ్యాలనిపించి చేశాను. అలా చేసే ముందు చివరి ఖండికలో దాదాపు అన్ని పదాలు మార్చి (భావం మాత్రం మారకుండా) పోస్ట్ చేశాను. మీరన్నట్లు ఈ 3 సం" లో నేను రాసే విధానంలో చాలా మార్పు వచ్చింది. అందుకే ఈ కవితలో కాస్త పదప్రయోగంలో ఇబ్బంది పడ్డాను. కాకపొతే దీనిలో ఉండే భావం మాత్రం నాకు చాలా ఇష్టం.

మీ కొసమెరుపు కస్సుక్కున దిగిందండి. అబ్బ చదివి చదివి ఒకటే నవ్వు కొన్నాను. నాతో పాటు ఈ నవ్వుల్ని పక్కన వాళ్ళకి కూడా పంచాను.