జ్ఞాపకాల కెరటాలు..
తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..
వెళ్లిపోయావా నేస్తం?
- ప్రచురించిన సమయం: 10:40:00 AM
- |
- రాసినవారు: ప్రతాప్
- |
- వర్గము: కవితలు..
వెళ్ళిపోతున్నావా నేస్తం చదివారా? దీన్ని చదివే ముందు దాన్ని చదువగలరని మనవి.
నువు విహరించిన పూతోటలో..
నువు పహరించిన దారిలో..
నే ఏరుకున్న నీ నవ్వుల కుసుమాలన్నీ
నను ఓదారుస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??
నువు మెరిసిన జ్ఞాపకాల విపణిలో..
నువు కురిసిన కలల ధరణిపై..
నే పేర్చుకొన్న నీ చూపుల సిత్రాలన్నీ
నను నడిపిస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??
నువు విరిసిన నా ఊహల పందిరిలో..
నువు విరచించిన నా ఊసుల మందిరిలో..
నే కూర్చుకున్న నీ నవ్వుల రువ్వులన్ని,
నను పరిహసిస్తూ ఉంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??
నువు నేను కలిసి నడిచిన సాగరతీరంలో..
నీ పాదాలను ఆర్తిగా స్పృశించిన కెరటాలు..
సైతకసీమల్లో నే నిర్మించుకున్న నీ తలపుల శిల్పాలు..
ఆరాటంగా నా మది ఘోషను వినిపిస్తుంటే నువ్వెళ్ళిపోయావా నేస్తం??
శిశిర said:
బాగుందండీ. కానీ దీనికన్నా "వెళ్ళిపోతున్నావా నేస్తం" చాలా బాగుందనిపించింది.
మరో విషయం. నేను పూర్తిగా మీ అభిమానిని అయిపోయాను. అంతర్జాలంలోకి వస్తే మీ బ్లాగు చూడకుండా వెళ్ళడం లేదు.