జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అందమైన బాల్యం..

  • ప్రచురించిన సమయం: 1:04:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


అందమైన బాల్యం..
అమ్మ ఒడిలో వికసించి..
అనుభూతుల రెక్కలు తొడిగి..
ఊహాలోకంలో విహరించాల్సిన అందమైన బాల్యం..
పేదరికపు ఒడ్డున రెక్కలు తెగి..
రేపటి ఆశలేని బ్రతుకు ముక్కలు అయి..
రుధిర సంద్రంలో కష్టాల నావ నెక్కి..
అలుపెరగని పోరాటం చేస్తోందీ అందమైన బాల్యం..

అందమైన బాల్యం..
అల్లరి చూపులతో ముద్దు తెప్పించాల్సిన..
చిలిపి చేష్టలతో నవ్వుతెప్పించాల్సిన..
ముద్దు మాటలతో మురిపించాల్సిన అందమైన బాల్యం..
బేల చూపులతో నన్నాదుకోరు అంటూ..
బరువెక్కిన మట్టితట్టలు నే మోయలేనంటూ..
జానెడు పొట్టకోసం అవిశ్రాంతపు శ్రమ జరుపుతుందీ అందమైన బాల్యం..

3 people have left comments

కల said:

ప్రతాప్ గారు చాలా బాగా రాసారు అండి. బాల్యం అంటేనే ఒక చక్కని కల. అందరు ఎంతో ఆనందంగా గడపాల్సిన రోజులు అవి. కాని బయట ప్రపంచంలో ఎందరో అనాధలుగా మనకి వీధుల్లో కనిపిస్తూ ఉంటారు. వారిని చూసినప్పుడు వారికి మనం ఏమీ చేయలేమా? అని అనిపిస్తుంది. ఆ బాధను నేను ఎన్నోసార్లు అనుభవించాను, ఈ రోజు అ బాధను మీ కవితలో కళ్ళకు కట్టినట్టు చూపించారు . నాదొక మనవి. ఇలా కవితలు రాసేవారు అందరు తమ కవితల ద్వారా ఇలాంటి సందేశాన్ని ఇవ్వండి. దాని వల్ల కొంత మందన్నా వారికి సాయం అందిస్తే చాలు. anyway meru chala baga rasaru. all the best

ప్రతాప్ said:

రాధిక, ఈ కవిత చదివి బాగా కదిలిపోయినట్లున్నావు. నిజమే కదా? అంతమంది అనాధలు బయట ప్రపంచంలో. విశ్వమంతా వీధుల్లో. ఎవరిదీ పాపం. చెట్టుకు కాయ భారమవుతుందా? మేఘం చినుకును మోయలేనంటుందా? పాపం ఒకరిది. శాపం ఒకరిది. నువ్వు ఇచ్చిన సూచన చాలా బావుంది. ఆచరించేందుకు ప్రయత్నిస్తాను.

ప్రసాద్ said:

ఏ బాల్యం ముక్కలైనా పాపం ఏ ఒక్కరిదో కాదు. మనందరిదీ.

--ప్రసాద్
http://blog.charasala.com