జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

నేను

  • ప్రచురించిన సమయం: 10:43:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


నాలో నేను..
నిత్యం భావ ఝరంపరిలో తడిసి ముద్దై పోతూఉంటాను..
అనునిత్యం అనురాగ శరంపరిలో ఆలంబన పొందుతూఉంటాను..
ఆద్యంతం సంఘర్షణ ఒడిలో స్వాలంబన పొందుతూఉంటాను..

నాతో నేను..
అంతం లేని ఆలోచనల స్రవంతిలో కొట్టుకుపోతూ ఉంటాను..
సొంతం కాని కలల ప్రాకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాను..
పొంతన కుదరని వాస్తవాల కడలిని ఈదుతూ ఉంటాను..

నాకై నేను..
ఊహల పందిరి వేసే అనుభూతుల్ని నెమరు వేసుకొంటూ ఉంటాను..
ఊసుల రంగవల్లులు వేసే స్వప్నాలని పరికిస్తూ ఉంటాను..
ఉరికే మది తాలూకు రసానుభూతులలో ఓలలాడుతూ ఉంటాను..

2 people have left comments

Bolloju Baba said:

చాలా బాగుంది.
స్వావలంబన అనుకుంటాను.

ప్రతాప్ said:

మీరన్నది నిజమే. కాని వాడుక భాషలో స్వావలంబన కాస్త స్వాలంబన అయికుర్చుంది. అందుకే ఆ పదాన్ని అలా వాడాను (కాస్త ప్రాస కూడా కలిసోస్తుందని).