జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అశ్రు విలాపం..

  • ప్రచురించిన సమయం: 4:45:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


నేస్తమా..
ఇన్నాళ్ళు నీ గుండెలో గూడు కట్టుకొని ఉండిపోయాను..
నీ వేదననంతా పంచుకొన్నాను..
నీ నివేదననంతా ఆలకించాను..
నీ స్వాతిశయాన్నంతా తిలకించాను..
నీ అభిసంశయాన్నంతా విన్నవించాను..
నీ ఆలోచనలన్నింటిని అర్ధం చేసుకున్నాను..
నీ ఊహలన్నింటిలో చేరి నీతో పాటు విహరించాను..
నీ జ్ఞాపకాలన్నింటిలో చేరి నీతో పాటు పహరించాను..
కాని ఈరోజు నేను..
నీ వేదనను భరించలేక నీ కనుకోనకుల్లోంచి జాలువారి..
నీ చెక్కిలిపై నుంచి ప్రయాణించి నెమ్మదిగా అదృశ్యం అయిపోతాను..
నేస్తం..
నా నిగమం నీ వేదనను కొంచమైనా తగ్గించగలుగుతుందని ఆశిస్తూ..
సెలవా మరి..

- Inspired by Yandamoori.

5 people have left comments

ఋణవంతుడు said:

వెనెల్లో ఆడపిల్ల చదివారా... అదేంటో గానీ అందులో కూడా అచ్చంగా ఇలాంటి కవితే... [:P]

ప్రతాప్ said:

నేను అ కవితలోనే ఆ సంగతి చెప్పాను. నా బ్లాగు పరిచయం లోనే నేను ఒక విషయం పేర్కొన్నాను. ఇందులోని వన్నీ నా సొంతమే కాదని, కొన్నింటిని సేకరించాను అని.

ఋణవంతుడు said:

క్షమించండి... గమనించలేదు...

bolloju ahmad ali baba said:

సారీ నేను కూడా గమనించలేదు.

ప్రతాప్ గారు మూలాలకు చాలాదూరంగా వచ్చేసామని మనకి మనం నమ్మితే వాటిని ఉటంకిచనక్కరలేదనుకుంటా. ఎవరో పెద్దరచయిత నేను చదివినదంటా నా రచనల్లో కనిపిస్తుందని అన్నాడట.

అఫ్ కోర్స్ ప్రేరణ పొందటం వేరు, అనుసరణ వేరు. రెండిటికి మద్య తేడా మంచి పాఠకులు గ్రహించగలరని అనుకుంటాను.

మీరు ఉటంకిచటం మీ నిజాయితీకి నిదర్శనం.
అభినందనలు
ముందుగా చెప్పినట్లు గా నేను కూడా గమనించలేదు. బహుసా ఆ పదం కవిత క్రింద బ్రాకెట్లలో ఉన్నట్లైతే ప్రస్ఫుటంగా కనిపించేదేమో?

బొల్లోజు బాబా

ప్రతాప్ said:

మీ సూచనకి ధన్యవాదాలు..

కడలి కెరటం సాగర మధన ఘోషకి ప్రతిరూపం ఆయితే
కన్నీటి కెరటం అంతరంగ వ్యధన భాషకు నిదర్శనం ఈ నా అశ్రు విలాపం..