జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

ఎలా తెలుపను??

  • ప్రచురించిన సమయం: 12:48:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


కంటున్నావా..???
నావి కాని కలలు కంటున్న నా నయనాల మాటున ఆగిన స్వప్నాలని...
వింటున్నావా..??
నాది కాని మౌనాన్నిఆశ్రయిస్తున్న నా అధరాల చాటున దాగిన మౌనాన్ని..

కనిపిస్తున్నదా..??
నాది కాని నివేదనను నివేదించలేక శిలై పోయిన నా ఎద తాలూకు మరణవేదన..
వినిపిస్తున్నదా..??
నావి కాని వేదనలను అందించలేక అలై పోయిన నా మది తాలూకు అరణ్యరోదన..

ఏదో తెలియని వేదన..
మది తాలుకు జ్ఞాపకాలని పట్టి కుదుపుతూ వుంటే..
ఏదో తెలియని యాతన..
ఎద తాలుకు గవాక్షాలని తీసి కరిగిన క్షణాలని చూపుతూ వుంటే..
నీకెలా వీడ్కోలు పలకను నేస్తం..???

18 people have left comments

సుజాత said:

"నావి కాని కలలు కంటున్న నా నయనాల మాటున ఆగిన స్వప్నాలను వింటున్నావా..." రెండు సార్లు చదివాను. Great!

భరత్ said:

చాల చక్కగా వ్రాసారు. బాగుంది

కత్తి మహేష్ కుమార్ said:

మీరు ఇప్పటివరకూ రాసిన కవితల్లో ఇదొక ఉత్తమకవిత అని నాకు అనిపించింది.ఒక పరిణితి,భావగాంభీర్యంతోపాటూ లాలిత్యం-వేదన ఒకేసారి పలికించడం బాగుంది.

MURALI said:

చాలా బాగుంది మీ కవిత.

చైతన్య said:

చాలా బాగుంది .

ప్రతాప్ said:

సుజాత గారికి, ముందుగా కృతజ్ఞతలు.
కొంపదీసి మీరు నన్ను తిట్టడం లేదుగా? ఇంకా నేను ద్విశ్రీ ని మర్చిపోలేదు. అందుకని కొద్దిగా భుజాలు తడుముకొంటున్నాను :-).

ప్రతాప్ said:

@భరత్, @మురళీ, @చైతన్య గార్లకి కృతజ్ఞతలు.

ప్రతాప్ said:

మహేష్ గారు,
ముందుగా కృతజ్ఞతలు.
ఇది మీకు బావుందేమో అనిపించవచ్చు గాని, నాకు మాత్రం ప్చ్ లాభం లేదు అనిపించింది. నే రాసిన వాటిలో కొన్ని నాకు బాగా నచ్చినవి ఉన్నాయి. కింద లింకులు ఇస్తున్నాను. వీలుంటే ఒక లుక్కేయ్యండి.
అమృతం కురిసిన రాత్రి.
వెళ్ళిపోతున్నావా నేస్తం? (ఇది మీరు చదివారనుకొంటాను).
ఇవి రెండు నాకు బాగా నచ్చినవి.

కల said:

చాలా బావుంది, ముఖ్యంగా ఈ రెండు లైన్లు చాలా బావున్నాయి.
కంటున్నావా..???
నావి కాని కలలు కంటున్న నా నయనాల మాటున ఆగిన స్వప్నాలని...

ఏదో తెలియని యాతన..
ఎద తాలుకు గవాక్షాలని తీసి కరిగిన క్షణాలని చూపుతూ వుంటే.

బొల్లోజు బాబా said:

చాలా బాగుంది.
మీకవితల్లో పద గాంభీర్యం చాలా బాగుంటుంది.
ఒక్కో పదచిత్రం లోని కాంట్రాస్ట్ బాగా లాక్కొచ్చారు.
మౌనాన్ని ఆశ్రయించిన అధరాల మౌనం
నివేదించలేని మరణ వేదన.
చాలా బాగున్నాయి.

అందరూ నచ్చిందని మెచ్చేసుకొన్నాకా, ఇక మొదటి వాక్యం గురించి చెప్పాలనిపించటంలేదు కానీ ధైర్యం చేసి......

కలలు కంటున్న నయనాల వెనుక ఆగిన స్వప్నాలేమిటి? కలలు స్వప్నాలూ ఒకటే కదా? (భలేగా బుట్టలో పడ్డట్టున్నానా కొంపతీసి)

బొల్లోజు బాబా

ప్రతాప్ said:

కలా కృతజ్ఞతలు. అందరు ముందర లైను గురించి మెచ్చుకొన్నారు, కానీ నాకు మాత్రం తెగ నచ్చిన లైను నువ్వు చెప్పిన చివరి లైనే. అందుకు వేల వేల నెనర్లు.

ప్రతాప్ said:

బాబా గారు, మీకోసం నిన్నంతా ఎదురు చూసాను.
ముందుగా కృతజ్ఞతలు.
ఎవ్వరూ అడగలేదేమిటా అని అనుకొంటున్నాను ఇంతలో మీరు అడిగేశారు. నిజమే ఆ లైను కొద్దిగా అయోమయానికి గురి చేస్తుంది ఎందుకంటే అక్కడ వాడిన (కలలు 'కంటున్న') పదాల వల్ల. కానీ ఆ లైను వెనుకా నా ఉద్దేశ్యం వేరు. నేను "నావి కాని కలలు కంటున్నాను కాని అవి నావి కాకపోవడం వల్ల నా కన్నుల వెనుకే ఆగిపోయాయి" ఈ ఉద్దేశ్యంతో వాడాను.

నిషిగంధ said:

చాలా బావుంది ప్రతాప్..

"ఎద తాలుకు గవాక్షాలని తీసి కరిగిన క్షణాలని చూపుతూ వుంటే.."

ఈ లైన్ చాలా నచ్చింది..

srisatya said:

నమస్కారం! మీ రచనలు చాలా బాగున్నాయి.నా కలం పేరు "శ్రీసత్య".నేను నా బ్లాగుల ద్వారా "కవితలు,అందం నా హక్కు.... అనే అంశంతో కూడిన చిట్కాలు,మొదలైనవి ప్రచురించనున్నాను.మీ అందరి ఆశీసులు నా పైన ఉండాలని కొరుకుంటున్నాను.
http://sreesatya.blogspot.com

ధన్యవాధములు...

బొల్లోజు బాబా said:

ప్రతాప్ గారూ
ఈ క్రింది బ్లాగులో మంచి కవిత్వం ఉంది. మీరింతవరకూ గమనించలేదని భావిస్తున్నాను. మీకు వీలు చిక్కినప్పుడు సందర్శించండి.
http://lalithya.blogspot.com/

బొల్లోజు బాబా

bhagavan cartoons said:

ప్రతాప్ బావుందండీ కవిత....

kalachander said:

bhayyaa!
baagaa raasaav. yekkadaa antha pedda katina padaalu vaadaledugaanee...

abbaaa..!
yentha katinaathisaralaanni palikinchaav.

yekkadaa vokkaprashnaarthakamtho thrupthipadaledu.

bahushaa...!
meeku prashninchadam, yedaloyalalothulloni sookhmaanni shodhinchi ashcharyaparusthoo aalochimpjeyadam palathopettinavidyalaagundi.

badhapadadamlo rajeepadaledu. o.k.

aa "yeda thaaluku",
"madi thaaluku" thadithara padaallo "thaaluku" viniyogaaniki badulu "thaalooku"gaa vaadithe padadoshamlekundaa undedi.

mallee kaluddaam.

kalachander.