జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అమృతం కురిసినరాత్రి

  • ప్రచురించిన సమయం: 2:55:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

ఎన్ని సరదాల ఆగరొత్తులు వెలిగించు కొన్నాను !!
ఎంత కాంక్షా శ్రీగంధంబు మైనొలది కొన్నాను !!
ఇంకా రావెందుకు ప్రభూ??
ఈ రాత్రి శంకాకులమై సడలి పోతూ వుంది..
మల్లెలు నను చూసి పరిహసిస్తున్నాయి..

నా మది నీ వెచ్చని ఊహల తాలూకు మధుర ఉఛ్వాసలతో నిండి పోయింది..
ఈ గది నా నులి వెచ్చని వూపిరి తాలూకు సుమధుర నిఛ్వాసలతో నిండి పోయింది..
నా విశాల చక్షువులు నా మది తాలూకు గవాక్షాలై..
నీ రాక కోసం అనిమేషమై ఎదురు చుస్తూఉంటే..
ఇంకా రావెందుకు ప్రభూ??

నీరవ నిశీధి వేళలో నే కన్న స్వప్నాల తాలూకు పరిమళాలని నీతో పంచు కోవాలని
ఆశగా..
ఆర్తిగా..
నే ఎదురు చుస్తూఉంటే..
ఇంకా రావెందుకు ప్రభూ??

నిశబ్దంగా నా కంటి నుంచి జాలువారిన అశ్రుబిందువు..
శబ్దం చేస్తూ నేలపై జాలువారుతూ..
నీవు సామీప్యాన లేవన్న నగ్నసత్యాన్ని నాకు గుర్తు చేస్తూ..
మరో అశ్రుబిందువుకు మార్గాన్ని సుగమం చేస్తున్న వేళ కూడా..
ఇంకా రావెందుకు ప్రభూ??

- Inspired by Tilak's అమృతం కురిసిన రాత్రి.

4 people have left comments

bolloju ahmad ali baba said:

కాంక్షా శ్రీ గంధం మైనొలది కున్నాను ఎంత రమ్యమైన భావన
శంఖూఖలం అంటే ఏమిటి (కొంపతీసి నా అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నానా?)

విశాల చక్షువులు మదితాలూకు గవాక్షాలు వావ్ ఎంతమంచి పదచిత్రం.

స్వప్నాల తాలుకు పరిమళం నాకూ తెలుస్తుంది
మరో అశృబిందువుకు దారినిస్తూ... ఎంతటి వేదన?

బ్లాగు ప్రపంచంలో నాకు చాలా చాలా బాగా నచ్చిన కవిత ఇది.

కాస్త విషాదం, కొంత విరహం, మరికొంత వేదన కవితనిండా కమ్ముకొని గుండెను పిండేస్తున్నాయి.

తిలక్ అన్నారు కానీ చలం గీతాంజలి (ఠాగూర్ కు అనువాదం) లో ఇవే ఊహలు, ఇలాంటి వేదన వెల్లువై పారాడతాయి. ఇది కూడా వాటి సరసన చేర్చదగిన అర్హత కలిగిన కవిత. అందులో ఒక భగవంతునికీ, భక్తునికి మద్య జరిగే సంభాషణా చమత్క్రుతులె కవితలుగా దర్శనమిస్తాయి.

ఈ కవితను కూదా ఒక భగవంతునికీ, భక్తునికి మద్య జరిగే సంభాషణ గానే నేను భావించి తరిస్తున్నాను.

mi migilina kavitalanu kUdaa cadavaali.

బొల్లోజు బాబా.

ప్రతాప్ said:

మీలాంటి వారి అభిమానాన్ని చూరగొన్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది.
నాకు తెలిసినంత వరకు శంఖాఖులం అంటే వ్యర్ధం అని అర్దం.
నేను రవీంద్రుని గీతాంజలి చదవలేదు..
తిలక్ అమృతం కురిసినరాత్రి ఇచ్చినంతటి inspiration నాకు మరే పుస్తకమూ ఇవ్వలేదు.
ఆ పుస్తకం లోని ప్రతి పదం ఓ ప్రభంధ కావ్యం..

Sridhar said:

baaga raasaaru, accam TAGORE ooha laaga, meeru TAGORE racanalu evainaa cadivite aayana oohalaki meeru enta daggiragaa vunnaro telustundi, emaina GOOD PIECE OF WORK, ANNATTU MEEKU 'AMRITAM KURISINA RAATRI' soft copy kaavalante naa blog lo download cesukondi.

కల said:

ప్రతాప్,
అబ్బా ఎంత బావుందో? చదువుతుంటే నిజంగా ఎంత ఏడుపు వచ్చేసిందో. ఒకరి విరహ వేదన కళ్ళకు కట్టినట్టు ఎంత బాగా రాసావో. ముఖ్యంగా చివరి చరణంలో అయితే
"నిశబ్దంగా నా కంటి నుంచి జాలువారిన అశ్రుబిందువు..
శబ్దం చేస్తూ నేలపై జాలువారుతూ..
నీవు సామీప్యాన లేవన్న నగ్నసత్యాన్ని నాకు గుర్తు చేస్తూ..
మరో అశ్రుబిందువుకు మార్గాన్ని సుగమం చేస్తున్న వేళ"

ఇంతటి వేదనలో కూడా నేనిన్నే తలుస్తున్నా అన్న భావం ఎంత రసరమ్యంగా ఉందో. ఇది బాబా గారన్నట్లు భగవంతునికి భక్తునికి జరిగే సంభాషణ అని నేననుకోవడం లేదు (నువ్వు దేవుణ్ణి నమ్మవు గాబట్టి). మరి ఇది తన సఖుని కోసం ఎదురుచూసి చూసి ఊడ్పులై పోయిన అభిసారిక విరహవేదన
అని అనుకోవచ్చా(అనుకోవచ్చా ఏమిటి నా బొంద ఇది ఇలానే ఉంటే)?

మొదటి చరణం తిలక్ విరహోఠ్కంత లోనిది కదూ? మొత్తానికి మహేష్ గారివల్ల ఒక మంచి కవిత చదివే భాగ్యం కలిగింది.