జ్ఞాపకాల కెరటాలు..
తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..
నీకెలా తెలుపను?
- ప్రచురించిన సమయం: 11:08:00 AM
- |
- రాసినవారు: ప్రతాప్
- |
- వర్గము: కవితలు..
నిశ్శబ్ధ నీరవ నిశీధిలో,
చిరుదివ్వెపు వెలుగువై కనిపిస్తావని..
పున్నమి వెన్నెల తరంగాలలో,
వెల్లువలా వెలువెత్తుతావని..
వసంత మలయమారుతంలో,
మరుమల్లియలా మురిపిస్తావని..
చల్లని సంధ్యా సమయంలో,
సంగీతంలా వినిపిస్తావని..
అల్లన మెల్లన పిల్లగాలులలో,
ఊహాల ఊయలవై ఊపేస్తావని..
పరిమళించు సుమ సుగంధాలలో,
విరిసిన నీ ఊసులు పంపిస్తావని..
ఇలా..
నీకై వేయికన్నులతో వేచియున్నానని,
నీ కెలా చెప్పను??
కానరాని నీ కోసం ఎక్కడని వెతుకను??
ఎవ్వరిని అడుగను??
నా మది లో నిండిన రూపానివి నీవని..
నా ఎదలో విరిసిన ఊహాకుసుమం నీవని..
నీకెలా తెలుపను??
వెతుక్కోండి.. -
4 people have left comments
Bolloju Baba said:
మలయ మారుతంలో మల్లియలా అనే ఊహ చాలా అద్భుతంగా ఉంది.
the rest is simply super.
మాంచి ఆర్ధ్రత కలిగిన కవిత.
ఊహా కాదు ఊహ అనుకుంటా సరిచూడగలరు.
అభినందనలతో
బొల్లోజు బాబా
Anonymous said:
me kavitha chala bagundhi chala heart touching ga vundhi