జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

నీ కోసం నేను..

  • ప్రచురించిన సమయం: 10:23:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

అగాధాల తలుపుల్ని తెరిచి, మనస్సు మూలల్లో చేజారిన
స్వప్నంకోసం వెతుకుతున్నా..
అశ్రుకెరటాల ఘోషని మరిచి, మది మందిరంలో నిలిపిన
నీ రూపం తలుస్తూ బ్రతుకుతున్నా..
శిశిర వర్ణాల విరహల్ని మరిచి, ఎదలోతుల్లో గూడుకట్టిన
విరజాజుల తలంపుల కోసం శోధిస్తున్నా..
నీవు మిగిల్చిన జ్ఞాపకాలన్నింటిని బంధించి, హృదిలోయల్లో విరిసిన
నిశ్శబ్దపు తపనల కోసం తపిస్తున్నా..
నువ్వులేని క్షణాలన్నింటిని నిషేధించి, అనుభూతుల్లో చేజారిన
ప్రతిక్షణపు తలపుల కోసం పరితపిస్తున్నా..
కనుపాపల మనవిని మన్నించి, రెప్పల మాటున దాగిన
నీ చిత్తరువు పలికే నిశ్శబ్దరాగం వింటున్నా..
విశ్వమంత చోటులో ఇమడలేక, నీ పక్కన మిగిలిన
చిరు స్థలం కోసం దాటలేని సప్తసముద్రాలని దాటుతున్నా..

4 people have left comments

శిశిర said:

చాలా బాగుందండీ. మీ కవిత చదివాక నా మనసులో భావాలు వేరొకరికెలా తెలిసాయి అనిపించింది.

Unknown said:

చాలా బాగా వ్రాశారు.నాకు బాగా నచ్చింది.

Anonymous

Anonymous said:

Chala Chala Bagundhi....
each line was touching.. each line delivered was excellent."

విశ్వమంత చోటులో ఇమడలేక, నీ పక్కన మిగిలిన
చిరు స్థలం కోసం దాటలేని సప్తసముద్రాలని దాటుతున్నా..
ye lines chala bagundhi.yedhe kadhu parthi oka line chala bagundhi.yentho feel ni carry chesthunayi. chala baga rasaru....

ప్రతాప్ said:

ఈ కవితకి ప్రేరణ ఒక హృదయ విన్నపం, ఒక ఎద విలాపం.
ఒక మనసు పడే మూగ వేదన, ఒక గుండె పడే చిరు తపన.
కాని అది పట్టించుకోని అవతలి వారికోసం ఇంత వేదన అవసరమా? అని నన్నెవరన్నా ప్రశ్నిస్తే
వారికి నా సమాధానం ఒక్కటే.. మీరు ఖచ్ఛితంగా మనస్సు లేని మూగ శిల అయివుంటారు..
ఈ కవిత ఒకరినన్నా కదిలించగలిగితే నాకు అంతకన్నా కావలసినది ఏముంది?
Anyway..
మీ అందరికి నా కవిత నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా వుంది.