జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

నీకిది న్యాయమా?

  • ప్రచురించిన సమయం: 5:55:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


మనస్సునంతా అలమెల్లనై కదిలించి..
తనువునంతా తటిల్లతై కరిగించి..
రూపంతా విద్యుల్లతై తాకి..
చూపంతా శరాఘాతమై సోకి..
లోకమంతా శూన్యమై వినిపించి..
దిక్కులన్నీ ఏకమై కనిపించి..
చుక్కలన్నీ నవ్వులై వికసించి..
మరులన్నీ కురులై మరిపించి..
ఊపిరులన్నీ విరులై మురిపించి..
ధ్యాసలన్నీ నా శ్వాసలై ఉరిపించి..
నన్నేడిపించుట న్యాయమా?

5 people have left comments

Anonymous

Anonymous said:

simply superb. very very toching.
oka ammaie ela dobuchuladutundo entha chakaga varnincharu. me imagination great andi,me prasa chala bagundi. kavithaka pranam prasa ani maroka sari neru pincharu. keep it up.

Anonymous

Anonymous said:

చాలా బాగుందండి. అభినందనలు.

Bolloju Baba said:

మరులన్నీ కురులై మరిపించి..
ఊపిరులన్నీ విరులై మురిపించి..
అన్నిపదాలు ఒకేలా ఉన్నాయి. భావాలు మాత్రం భిన్నం. ఎక్సలెంట్.


బ్యూటిఫుల్ థాట్ .
అంత మంచి ఫొటో ఎక్కడ దొరికిందండి బాబూ. అదరగొట్టే సారు.

Purnima said:

beautiful photograph and wonderful expression.. Lovely!!

ప్రతాప్ said:

బాబా గారికి మరియు పూర్ణిమ గారికి ముందుగా కృతగ్ఙతలు. కవిత రాసే దానికన్నా దానికి సరిపోయే ఫోటో కోసం వెతకడం నిజంగా కత్తి మీద సామే. ఏదో అదృష్టం కొద్ది ఒక మంచి ఫోటో దొరికిందండి. దాన్ని అలా పెట్టేసాను. నా భావాలకి సరిపోయే చిత్రాన్ని వెయ్యమని ఒకసారన్నా వర్మ గారిని అడగాలి.