జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

Apocalypto

  • ప్రచురించిన సమయం: 10:13:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: సినిమాలు


నేను ఈ మధ్య MelGibson దర్శకత్వం వహించిన Apocalypto సినిమాని చూడటం జరిగింది. దీన్ని చూసిన మొదలు బ్లాగ్ లోకంలోని మిత్రులందరికీ దీన్ని పరిచయం చెయ్యాలనిపించింది. సినిమా అద్యంతమూ చాలా ఆసక్తితో నడుస్తుంది. ఇలా సినిమాని అద్యంతమూ ఆసక్తిగా నడిపించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. ఇక సినిమా కథ, కథనాల విషయం దగ్గరికి వస్తే,

సినిమా మొదలు కావడమే Will Durant యొక్క ఒక quote "A great civilization is not conquered from without until it has destroyed itself from within." తో మొదలవుతుంది. ఇందులో హీరో ఒక ఆటవిక తెగకి చెందిన నాయకుని కొడుకు. తనకి గర్భంతో ఉన్న భార్యా ఒక కొడుకు ఉంటారు. ఆ తెగకి చెందిన వారితో కలిసి అడవిలో జంతువులని వేటాడుతూ అక్కడే నివసిస్తూ ఉంటారు. ఒకానొక రోజు ఆ తెగ మీదకి వేరే తెగ వారు దండెత్తుతారు. ఆ సందర్భంలో మన కథానాయకుడు వాళ్ళకి తెలియకుండా తన భార్యా పిల్లల్ని అక్కడే ఉన్న ఒక పెద్ద బావిలాంటి దానిలో దాచి పెడతాడు. దాడి చేసిన తెగవారు హీరోతో పాటు కొంతమందిని బందీలుగా పట్టుకొని కొంతమందిని చంపేస్తారు. చనిపోయినవారిలో హీరో తండ్రి కూడా ఉంటాడు.

దాడి చేసిన తెగవారు అందరిని బంధించి తమ "మాయా" పట్టణానికి తరలిస్తారు. అక్కడ వారిని బలికోసం సిద్దం చేసిన వేదిక మీద కొంతమందిని బలిస్తారు. ఆ దృశ్యాన్ని దర్శకుడు ఎంతో హృదయవిదారకంగా చూపిస్తాడు. ఇంతకీ బలి ఎందుకోసం ఇస్తారో మీరు తెర మీద చూస్తేనే మంచిది. కొంతసేపటికి హీరో ఎలానో ఒకలా వారి చెర నుంచి తప్పించుకొని తన భార్యా బిడ్డల్ని కాపాడేదానికి బయలుదేరుతాడు. తప్పించుకొనే క్రమంలో దాడి చేసిన తెగ యొక్క నాయకుని కుమారున్ని అంతమొందిస్తాడు. ఎలాగైనా హీరో ని చంపాలనే కృతనిశ్చయంతో దా.తె.నా., ఎలాగైనా కుటుంబాన్ని రక్షించుకోవాలని హీరో అడవిలోకి బయలుదేరుతారు. హీరో తన కుటుంబాన్ని రక్షించు కొన్నాడా లేదా? దా.తె.నా. ఏమయ్యాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మిగతా కథ మీరు వెండి తెర మీద చూడాల్సిందే.

మరచిపోయాను చెప్పడం, ఈ చిత్రం 2007 సం" గాను 3 OSCAR awards ని గెలుచుకొంది.

మీరు ఈ సినిమా ని చూడాలనుకొంటే ఇక్కడ చూడవచ్చు.


సినిమా పేరు: Apocalypto
దర్శకుడు: Mel Gibson
సంస్థ: Icon Productions & Disney
తారాగణం: Rudy Youngblood, Dalia Hernández, Jonathan Brewer మొ" వారు.

4 people have left comments

Unknown said:

This comment has been removed by the author.

Unknown said:

It is the most disturbing Movie I have ever seen. But direction is excellent.

Also if possible see "Blood Diamond" another disturbing movie I've ever seen.

Anonymous

Anonymous said:

This is the excellent movie I have ever seen, Direction soooper, ఈ సినిమా చూసేటప్పుడు నేను ఒకటి ఆలోచించా మన వాల్లలో ఆ కారెక్టర్ కు ఎవరు సూట్ అవుతాడొ అని కమ సరిపోతాడు
బుర్ర ఓ రెండు మూడు గంటలు పాటు ఆదీనం తప్పింది ఈ సినిమా చూడగానే

కల said:

ప్రతాప్,
అంత బావుందా ఈ సినిమా? movie మీ దగ్గర ఉందా?