జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

ఎంకి..

  • ప్రచురించిన సమయం: 2:36:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

పృథ్వీ గారు గీసిన ఒక అద్భుతమైన కళాఖండానికి నా స్పందన..

కడవనెట్టుకొన్న రాయంచ చెరువుగట్టు మీద నడచుచుండ..
రెప్పదాటుకొన్న చూపు పడతి చనుకట్టు మీద పడుచుండ..
పిక్కదాటుకొన్న అతివ చీరకట్టు మదిన మరీచికలు వీచుచుండ..
మనస్సు దోచుకున్న మగువ కనికట్టు ఎద చప్పుడు దోచుచుండ..

అలమెల్లన కదిలే రమణి కృష్ణవేణి జంటసర్పాలేమో అనిపించుచుండ..
వాలుకళ్ళలో మెదిలే తొయ్యలి భావమోహనం రాగ వీచికలు ఆలపించుచుండ..
పల్లెలో విరిసిన మానిని ముగ్ద మోహన సౌందర్యం ఎంకిని తలపించుచుండ..
సుదతి ముఖారవిందం చూసి పద్మమేమో అని భ్రమరం భ్రమించుచుండ..

లలన ఆలన మెల్లన వయ్యారియై, భీతన హరిణేక్షియై..
చెరువు గట్టు దాటి, పుట్ట దాటి పల్లెవైపు సాగిపోయింది.

ఫృధ్వి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు..

5 people have left comments

Venu said:

ఈ బొమ్మ ఎంకి లాగ అసలు అనిపించట్లేదండి. నండూరి ఎంకి రూపం ఇలా ఉండదు కదా?

ప్రతాప్ said:

క్షమించండి. నండూరి వారి ఎంకి రూపం ఎలా ఉంటుందో వారి కవితల్లో తప్ప నేను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. కవితకి టైటిల్ ఎం పెట్టాలో తెలియలేదు. ఎలానూ ఎంకి అనే పద ప్రయోగం కవితలో వచ్చింది కాబట్టి ఆ పేరే సరిపోతుందేమో అని అనుకొన్నా.

కొత్త పాళీ said:

@ venu .. ఎంకి అలా ఎందుకుండదు??
@ప్రతాప్ .. ఒక్క సూచన. పదాలు ఉపయోగించేముంది, సరైన స్వరూపం, అర్ధం తెలిసి వాడాలండీ. మరీచిక అంటే ఎండమావి .. ఇక్కడ ఆ అర్ధం సరిపోదు. భీత హరిణేక్షణ అనేది సరన వాడుక .. అర్ధం బెదరిన లేడి చూపుల వంటి చూపు గలది.

ప్రతాప్ said:

కొత్త పాళీ గారు,
ముందుగా మీ నిర్మోహమాటమైన అభిప్రాయానికి ధన్యవాదములు.
మరీచిక అంటే ఎండమావి అని నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఆ పదాన్ని కోరిక (మరీచిక అంటే కోరిక అనే అర్ధం కూడా వస్తుందనుకొంటాను) అనే అర్ధం వచ్చేట్టు వాడాను. కాకపోతే కోరికలు ఎలా వీస్తాయి, అవి రేగుతాయి కాని అని మీరు ప్రశ్నిస్తే నేనేమి చెప్పలేను.
భీత హరిణేక్షణ అన్న పద ప్రయోగం గురించి నాకు తెలుసు. కాకపోతే నాకు కాస్త పద ప్రయోగం చెయ్యడం అలవాటు (ఇష్టం కూడా). ఇక్కడ భీతన మరియు హరిణేక్షి అన్న పద ప్రయోగాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే వాడాను. భీతన అన్న పదం అర్ధం మీకు తెలుసనుకొంటాను. అయిన మిగతావారికోసం చెబుతాను. భీతన అంటే భయపడిన, భీతిచెందిన అని, హరిణేక్షి= హరిణి + అక్షి (అక్షి = కన్ను) జింక కన్నుల వంటి కన్నులు కలది అన్న అర్ధం వచ్చేట్టు వాడాను. వీటిలో ఏమన్నా తప్పులు ఉంటే వాటిని సూచించగలరు.

nagalakshmi said:

mee kavita chaaaalaa bagundandi.