జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

మరచిపోయావా?

  • ప్రచురించిన సమయం: 3:46:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


మరచిపోయావా?
నువ్వు నేను కలిసి పంచుకొన్న ఊహలు..
మనస్సూ మనస్సూ కలిపి విరచించుకొన్న ఊసులు..

వాడిపోయాయా?
నాకై నువు రువ్విన ఓరచూపుల కంటికొనల ధృక్కులు..
నాకై నువు రాల్చిన మంత్ర ముగ్ధపు మనోహర వాక్కులు..

చెరిగిపోయాయా?
నువ్వు నేను మెలిసి నడిచిన దారిలో విరిసిన పాదముద్రలు..
నువ్వు నేను రాసి మది అంతరంగపు పుటల్లో దాచుకున్న కవితలు..

కరిగిపోయాయా?
నీకై నేను పంపిన వలపు మేఘసందేశాల ఆనందవీచికలు..
నీకై నేను వొంపిన తలపు తనూ వైభవపు విరీచికలు..

తరిగిపోయాయా?
చేయి చేయి కలిపి వెన్నెల రాత్రుల్లో మనం ఆలపించిన మంజీరనాదాలు..
ధ్యాస శ్వాస కలగలిపి పున్నమి కాంతుల్లో మనం తిలకించిన సాగరకెరటాలు..

మరచిపోయావా?
మన్ను మిన్ను కలిసినట్లున్నా అవి ఎప్పటికీ కలవవన్న నిజం..
కన్ను కన్ను పక్కనే ఉన్నా అవి ఎప్పటికీ చూసుకోలేవన్న నిజం..

8 people have left comments

MURALI said:

బావుంది. ఇంకా మంచి ఊహలు మీనుంచి ఎదురుచూస్తున్నా.

పూర్ణిమ said:

baagundi :-)

ప్రతాప్ said:

Thanks Murali & Purnima

pavani said:

marachipoyava chadivi nenu nanu marachipoyanu.chaala bavundi prathap.

oremuna said:

Nice Template colors.

femalish colors!

రాధిక said:

బావుంది.

ప్రతాప్ said:

పావని,
ఏంటి పొగుడుతున్నావా? లేక తెగుడుతున్నావా? k k, సరదాకి. చాలా 'కష్టపడి' చదివి నీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు చాలా చాలా థాంక్స్.
కిరణ్ గారు,
మీరు నన్ను మెచ్చుకున్నారా? ఒహ్.. అయ్, అయ్.. మా కిరణ్ గారు నన్ను మెచ్చుకున్నారోచ్ అని నాకు చిందులు వెయ్యాలని ఉంది. కానీ ప్రస్తుతానికి నేను ఆఫీసులో ఉన్నాను కాబట్టి హైదరాబాద్ ఒక పెద్ద భూకంపాన్ని తప్పించుకుంది.

రాధిక గారు..
మీరు కవితలే చాలా సింపుల్ గా రాస్తారనుకొన్నాను. కామెంట్స్ కూడానా? మీ అంత సింపుల్ గా రాయాలని ప్రయత్నించీ, నించీ, చించీ నావల్ల కాక ఇలా కాస్త గ్రాంధికంలో రాస్తున్నా.