జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

జాడలు

  • ప్రచురించిన సమయం: 5:40:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


నా కన్నుల మాటున దాగిన బాసలు..
నా పెదవుల చాటున చిక్కిన ఊసులు..
నా ఎద సడిలో ఇంకా పురివిప్పని ఊహలు..
నా అంతరంగమధనపు కన్నీటి కలలు..
నా మది నడిసంద్రపు జ్ఞాపకాల అలలు..
నా హృదయ అంతర్వాహినిని తాకే తప్త శిలలు..
నాలో మమేకమై, జీవితాంతం నిలిచే నీ జ్ఞాపకాలు..
నా మనోవ్యధను తీర్చే మలయమారుతపు వీచికలు..
నా గుండె గుప్పిట దాగిన విరహాగ్నిని దాచే కనీనికలు..
నా స్వాప్నికజగత్తులో నాతొ విహరించే నా అభిసారికలు…

అన్నీ నీవే.. అంతా నీ తావే.. అనంతానా నీ జాడే..

4 people have left comments

మీనాక్షి said:

చాలా బాఉంది ప్రతాప్ గారు.

Bolloju Baba said:

బ్యూటిఫుల్.
బొల్లోజు బాబా

Kranthi M said:

చాలా బాగు౦ది.

కల said:

ప్రతాప్,
బావుంది. అంతా ఆలోచనలమయం అయినప్పుడు, సులోచనలు కన్నీటిమయం అవుతాయని చాలా చక్కగా చెప్పావు.
దీనికి వాడిన ఇమేజ్ చాలా బావుంది. వెరైటీ గా ఉంది.