జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

నీవు

  • ప్రచురించిన సమయం: 3:38:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


ప్రతి దృశ్యం లోనూ..
అదృశ్యం గానూ..
నయనానందకరంగా నీవు..

ప్రతి శబ్దం వెనుకా..
సదృశ్యం గానూ..
తప్తశిలలా నేను...

కంటికెరుపులా..
వంటి మెరుపులా..
కైపెక్కిన కన్నుల నిండుగా నీవు..

తొలిసంజె ఎరుపులా..
వెన్నెల మెరుపులా..
మెరుపెక్కిన మిన్నుల నిండుగా నేను..

పెదవి మధ్యన..
మౌనం చాటున..
సిగ్గు తెరల వెనుక నీవు..

అల్లరి నవ్వుల మాటున..
అవ్యక్తపు విరహం పైన..
ఆలోచనల తీరాల ముందుర నేను..

5 people have left comments

sujji said:

కవిత చాలా చాలా... బాగుంది.

బొల్లోజు బాబా said:

nice

కల said:

ప్రతాప్ బావుంది. చివర కొంచెం ఎందుకో గతి తప్పింది అనిపిస్తోంది.

రాధిక said:

చాలా బావుంది.

Sasikanth Manipatruni said:

చాలా బాగుందండీ!