జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

మీకేం తెలుసు??

  • ప్రచురించిన సమయం: 11:21:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


కల చెదిరినా కన్నీరు రాదేం??
మిన్ను విరిగినా మది చెదరదేం??
ఆశల సౌధం క్రుంగినా ఎద విరగదేం??

మదిలో బాధాసుడిగుండాల హోరు..
ఊహల రెక్కలకు సంకెళ్ళు వేశారు..
ఆశల హరివిల్లును కూల్చేసారు..
భవిష్యత్తును కాలరాసారు..
కలల మ్రొగ్గలను చిదిమేసారు..

మీకేం తెలుసు??
ప్రాతఃకాలపు హిమబిందువు లాంటి మా ఆశల వర్ణాలు..
మీకేం తెలుసు??
మనో ప్రాంగణాన మేము పెంచుకొన్న వూహల మ్రొక్కలు..
మీకేం తెలుసు??
కుల మతాతీతపు అవ్యక్త భావనల తియ్యందనాలు..
******************************************************************************************
నిజంగా నా స్నేహితుడి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఆధారంగా రాసాను. కుల, మతాలకి అతీతంగా వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇక్కడ నిజజీవితానికి విరుద్ధంగా ఏమీ జరగలేదు. అమ్మాయికి ఇష్టంలేకుండా పెళ్లి చేసారు, అలానే అబ్బాయికి కూడా. కానీ వేరొకరితో జీవితం పంచుకోలేని ఆ అమ్మాయి విడాకులు తీసుకుంది. ఇది తెలిసిన మా వాడి భార్య వాడిని రోజూ సాధించుకు తింటోంది. పెద్దల మూర్ఖపు పంతాలకి పిల్లల జీవితాలు ఎలా చేజారిపోతాయో చెప్పేదానికి ఇదొక చిన్న ఉదాహరణ.
*******************************************************************************************

3 people have left comments

మీనాక్షి said:

చాలా బా రాసారు ప్రతాప్ గారు..కాని కింద మెసేజ్ చదివాక బాధేసింది.

రాధిక said:

రెండు మనసుల్ని కలపడానికి చేతులురావు గానీ పెద్దలకి,నలుగురు మనుషులు బాధపడుతుంటే వినోదం చూడడం మాత్రం వచ్చు.పెద్దలు చేసిన తప్పుకి అమాయకులయిన మరో ఇద్దరు బాధితులయ్యారు.

కల said:

మరి పెద్దలందరిని అలా తూలనాడలేం. అలా అని అందరు పెద్దలు ఇలానే లేరు. ఫలానా అబ్బాయి/అమ్మాయి నాకు నచ్చారంటే ఆలోచించే పెద్దవారు చాలా మంది ఉన్నారు. కాకపోతే సమస్యల్లా అలా ఆలోచించగానే సరిపోదు. పిల్లలది ఆకర్షణా లేక ప్రేమనా అని తేల్చుకొని వారికి ఆమోదం/వ్యతిరేక తో తెలపాలి. ఆకర్షణకి ప్రాతిపదికత ఏమిటి అంటే నేనేం చెప్పలేను కానీ వయస్సును మాత్రం చూపగలను.

ప్రతి క్షణం కొట్టుకొంటూ కలిసి ఉండటం కన్నా విడిపోయి కాస్తో కూస్తో సుఖంగా ఉండటం మంచిది అని నా అభిప్రాయం.