జ్ఞాపకాల కెరటాలు..
తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..
వేదన
- ప్రచురించిన సమయం: 5:49:00 PM
- |
- రాసినవారు: ప్రతాప్
- |
- వర్గము: కవితలు..
కల చెదురుతూ.. కన్నీరు చిదుముతున్న వేళ..
కంటిపాప బెదురుతూ.. కంటికెదురుగా వున్న స్వప్నం కనుమరుగవుతున్న వేళ..
అలలా మెదులుతూ.. మస్తిష్కంలో ఆలోచనలు ముప్పిరుగొంటున్న వేళ..
శిలలా చెదురుతూ.. అన్యమనస్కపు ఆక్రోశాలు ముసురుకొంటున్న వేళ..
ఎక్కడో దూరంగా నిశీధి నీరవంలో ఒక పువ్వు విచ్చుకొంటున్న వేళ..
ఎచ్చటో మరోచోట ఇంకో పువ్వు రాలి పోవడానికి సిద్దమవుతున్న వేళ..
ఇంతటి వేదనలో కుడా..
నా కెదురుగానున్నచిత్తరువు నీవు..
నా కంటిపాపలో దాగిన చిత్రం నీవు..
నా ఎదలో నిలిచినది నీవు..
నా మది మరువనిది నిన్ను..
కంటిపాప స్వప్నం నీవని..
నిద్దుర పోనివ్వని కమ్మని జ్ఞాపకం నీవని..
అలవికాని నా ఆలోచనల అంతరంగ మధనాలు..
నిలవనియ్యని నీ ఆలాపనల సరిగంగ మధురిమలు..
ఎన్నటివీ జ్ఞాపకాలు??
ఎప్పటివీ ఆలోచనలు??
ఎక్కడివీ ఆలాపనలు??
Anonymous said:
కవితలంటే నాకిష్టం
స్పందింపచేసే మీ కవితలంటే మరీ ఇష్టం