జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

అడిగా

  • ప్రచురించిన సమయం: 12:28:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

కదిలే కాలాన్నీ కాస్సేపు ఆగమని అడిగా..
నీ సమక్షంలో వున్నప్పుడు..

చెదిరే కలల్ని కాస్సేపు వుండమని అడిగా..
నీవు నా స్వప్నాలలో విహరిస్తున్నప్పుడు..

ఎగిసే అలల్ని కాస్సేపు అలానే వుండమని అడిగా..
నీ ఊహల జ్ఞాపకాలని అవి మోస్తూ ఉంటే..

పున్నమిరాజుని అడిగా ఎప్పటికి అలానే వెన్నెల చిందించమని..
నీ మోములో వెన్నెల తాలూకు అవ్యక్తానుభూతి గోచరిస్తూ ఉంటే..

తళుక్కున మెరిసే తారకలని అడిగా..
నీ దరహాసాల తలుకుల్ని అవి మురిపిస్తూ ఉంటే..

ఎగిరే విహంగాలని, రెక్కల్ని ఇవ్వమని అడిగా..
నీ దరి చేరాలని మనసు తొందర పెడుతూంటే...

హోయలోలికే స్రవంతుల్ని అడిగా..
నీ హోయల్ని చూసి హొయలు వెల్లబోయమని.. వెలవెలబొమ్మని..

0 people have left comments

Commentors on this Post -