జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

జ్ఞాపకం

  • ప్రచురించిన సమయం: 12:40:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

జ్ఞాపకాల అరల్ని తవ్వుతూంటే...
ఎక్కడో చూసిన జ్ఞాపకం..
ఎప్పుడో కలసిన జ్ఞాపకం..

ఎన్నడో ఓ నవ్వు రువ్వినా జ్ఞాపకం..
ఎచ్చటో కలసి నడచిన జ్ఞాపకం..
ఎదరినో కలసి ఊసులద్దిన జ్ఞాపకం..

కలల తాలూకు తియ్యదనాన్ని కలసి పంచుకొన్న జ్ఞాపకం..
ఊహాల తాలూకు అనుభూతుల్ని నెమరు వేసుకొన్న జ్ఞాపకం..
కష్టాల తాలూకు బాధల్ని కలసి మోసిన జ్ఞాపకం..

ఇన్ని జ్ఞాపకాల మధ్యన..
నీవు మిగిల్చిన ఒంటరితనపు అనుభూతుల మధ్యన ఏకాకిలా నేను..

1 people have left comments

Anonymous

Anonymous said:

జ్ఞాపకం అన్నా చిన్న పదాన్ని చాల చక్కగా చప్పారు. నా జ్ఞాపకాలని మనసులోతుల్లో నుంచి కదిలించారు . చాల బాగుంది.