జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

సవ్వడి

  • ప్రచురించిన సమయం: 12:02:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

చిరుగాలి చిరు సవ్వడి చేసినా చాలు..
అది నీ పాదాల సవ్వడేమోనని..
నాలో చిన్న అలజడి!!

గుడిగంటలు చిరు ధ్వని చేసినా చాలు..
అది నీ మువ్వల సవ్వడేమోనని..
నాలో చిన్న ప్రతిధ్వని!!

పువ్వులు చిరు వయ్యారాలు పోయినా చాలు..
అది నీ నడకల హొయలేమోనని..
నా చిన్ని గుండెలో చిరు హొరు!!

పిల్ల తుమ్మెర అల్లరిగా నా శ్రవణాన్ని సృశిస్తే..
అది నీ శ్వాస తాలూకు స్పర్శ ఏమోనని..
నా మనస్సులో చిన్న కదలిక..

పల్లె పడుచుల రవళిని నీ అందెలరవళి ఏమోనని..
పరవసించి పాడే కోయిల పాటలని నీ మాటలేమోనని..
ఉషఃకిరణాల ఉషఃస్సులో మెరిసే తుషారబిందువుని చూసి..
నీ ముక్కేరేమోనని ముచ్చట పడుతున్నా..

0 people have left comments

Commentors on this Post -