జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

గుర్తున్నవా??

  • ప్రచురించిన సమయం: 5:44:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..


ఆగని కాలం వెంబడి పరుగులు తీస్తూ..
ఎగిసే అలల పైబడి అందనంత ఎత్తుకు ఎగుస్తూ..
కరిగే కలల కోసం వెంబర్లాడుతూ..
నే తీసే పరుగులు నీకు గుర్తున్నవా??

ఊహా సౌధాల వెంబడి ఉరుకులు పెడుతూ..
గడచిన గతాల కోసం ఎదను త్రవ్వుతూ..
నీ సన్నిధిలో ఆగిన క్షణాలను అందుకొంటూ..
నే వేసే అడుగులు నీకు గుర్తున్నవా??

నీ నీడను అనుగమిస్తూ..
నీ జాడను అనుసరిస్తూ..
నీ శ్వాసను తీసుకుంటూ..
నీ ధ్యాసను మోసుకుంటూ..
నే రాల్చే కన్నీటి మడుగులు నీకు గుర్తున్నవా?

3 people have left comments

Kathi Mahesh Kumar said:

నీ కవిత బాగుంది. ఈ విషయం మాత్రం నాకు బాగా గుర్తుంది!

Bolloju Baba said:

బాగుంది.
బొల్లోజు బాబా

కల said:

ప్రతాప్,
చాల సింపుల్ గా నీ ఎమోషన్స్ ని రాసేసావు.
ప్రత్యేకంగా ఈ చివరి లైన్, "నే రాల్చే కన్నీటి మడుగులు నీకు గుర్తున్నవా?"
simply superb. keep going.