జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

స్నేహానికి ప్రతిరూపం

  • ప్రచురించిన సమయం: 11:30:00 PM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

నేస్తమా.. నేస్తమా..
లాలించే అమ్మవు నీవై..
పాలించే నాన్నవు నీవై..
నీ గుండెల్లో నిలిపావు నను భద్రంగా..

స్వప్నాల ఈ జగత్తులో..
దారేదో తెలియని ఈ లోకంలో..
నను నడిపించావు గారంగా..

అరుణిమ దాల్చిన ఆకసంలా..
రుధిరం దాచుకొన్న అగ్నిలా..
వున్న నను,
నీ మాటలతో చేసావు హిమంలా..

ఆలోచనల హారం ధరించి..
బాధా సుడిగుండాలలో చిక్కి..
వున్న నను,
నీ చేతలతో చేసావు హాయిగా..

నా ఒంటరి జీవితపు పుస్తకంలో..
నే తెరిచే ప్రతి పుటలలో..
నే వెదికే,
నా కవితా భావజాలపు ప్రతి అక్షరం నీవే సుమా!!

నా గుండె చేసే చిరు సవ్వడిలో..
నా కంటి నీరవపు నిశబ్దంలో..
నిశరాత్రి, కటిక చీకటిలో..
నా నీడ నను వీడిపొయినా..
నా వెంట వుండే భావన నీవే సుమా!!

నే సంతోషం పొందే వేళ..
నను అందరు అభినందించే వేళ..
నా నయనాలు వెతికేది..
ఎక్కడో దాగి, నా విజయాన్ని..
నా కన్నా ఎక్కువగా ఆస్వాదించే నిన్నే సుమా!!

నేస్తమా.. నేస్తమా..
నను ఎప్పటికి వదలకుమా..
నేస్తమా.. నేస్తమా..
నను ఎన్నటికీ వీడకుమా..

1 people have left comments

ప్రతాప్ said:

ఈ కవితలో నేను ఎక్కువ పదాలు ఉపయోగించి ఉండకపోవచ్చు..
కానీ ఇది నా మది లోని భావాల ప్రతిరూపం..
ప్రతి క్షణం నా వెంటే ఉంటూ..
నాలోని సంఘర్షణలకు..
అక్షర రూపం ఇవ్వమని నను సదా ప్రోత్సహించే..
నా ప్రియస్నేహితురాలికి ఈ కవిత అంకితం..