జ్ఞాపకాల కెరటాలు..

తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..

ఆకాశం.. నీకోసం..

  • ప్రచురించిన సమయం: 10:57:00 AM
  • |
  • రాసినవారు: ప్రతాప్
  • |
  • వర్గము: కవితలు..

ఆకాశం మబ్బుల పందిరి వేసింది..
నీకోసం మేఘాల పల్లకి పంపింది..
తనతో నిను రమ్మని..
అదిగో నను చూడమని..
అల్లరిగా హరివిల్లుల రవళి వేసింది..

ఆకాశం తనకోసం ఒక చందురుని వుంచెనులే..
ఆకాశం నాకోసం మరొక చందురుని ఇల పైకి పంపెనులే..
తనకు నీ నవ్వులే ఇవ్వమని..
ఇదిగో నీ నవ్వుల తారకలను అడగమని..
అందంగా తారకలని అడిగింది..

వయ్యారాలు పోయే మేఘమాలికలని..
నయగారాలు పోయే రాజహంసలని..
నీతో నడవమని..
నడకల హొయ్యారాలు నేర్వమని..
ఆకాశం.. నీకోసం..
కరిగిందిలే.. కరిగి..
చినుకుగా మారి.. వరదై పొంగి..
ప్రతి చినుకుతో నిను స్పృశించాలని చూసి..
చేతకాక.. తాళలేక..
బాధపడుతూ..
ఆకాశం.. నీకోసం.. ఎర్రబడిందిలే..
ఎందుకో.. ఏమిటో..
ఆకాశం.. నీకోసం.. ఎర్రబడిందిలే..

0 people have left comments

Commentors on this Post -