జ్ఞాపకాల కెరటాలు..
తలపుల్ని తట్టి లేపే.. ఎద తలుపుల్ని తెరిచే.. మది తాలూకు ఆరాటాలు ఈ జ్ఞాపకాల కెరటాలు..
వెళ్ళిపోతున్నావా నేస్తం..
- ప్రచురించిన సమయం: 5:35:00 PM
- |
- రాసినవారు: ప్రతాప్
- |
- వర్గము: కవితలు..
కనురెప్పలు నీ జ్ఞాపకాల్ని మోయలేనంటూంటే..
కనుపాపలు నీ రూపాన్ని దాయలేనంటూంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..
వెచ్చగా విరిసిన కల చిక్కని కన్నీరు చిమ్ముతుంటే..
ఝుమ్మని ఎగిసిన అల దక్కని స్నేహాన్ని చూపుతుంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..
వెనక్కిరాని కాలం మదికందిన మధురానుభుతుల్ని మమేకం చేస్తూంటే..
వెక్కివచ్చే ఏడుపు హృదికందిన స్వరాగమాలికల్ని చిన్నాభిన్నం చేస్తూంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..
అనుభూతుల హారంలో చేరిన పుష్పాలు నను చూసి జాలిపడుతూంటే..
ఎదలోతుల దారంలో కూరిన రాగాలు నను చూసి శిలలై పోతూంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..
నిదురించే తోటలో నే ఏరుకున్న ఊహల కుసుమాలు నను చూసి విలపిస్తూంటే..
దరిచేరిన పాటలో నే కూర్చుకొన్న ప్రభంధాలు విషాద రాగం ఆలపిస్తూంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..
చిరునగవు చాటున దాగిన మౌనం మనస్సును మెలిపెడుతూంటే..
అడుగుల మడుగులో దాగిన జంటపాదాలు నను ఓదారుస్తూంటే..
వెళ్ళిపోతున్నావా నేస్తం..
వెతుక్కోండి.. -
12 people have left comments
arunakiranalu said:
execellent pratap garu.. aa avedana kallaku kattinattu chepparu, chala bagundadi
aruna
Bolloju Baba said:
కవిత కు లయ చదివేటప్పుడు ఎంతటి హాయినిస్తుందో మీ కవిత ఉదాహరణగా నిలుస్తుంది.
కనురెప్పలు,కనుపాపలు
మోయలేనంటూంటే
మోయలేనంటూంటే
కల, అల
చిక్కని, దక్కని
మది, మధుర, మమేకం
వెనక్కి రాని, వెక్కివచ్చే
అడుగుల, మడుగు
దాగిన, పాదాలు.
చాలా చిన్న చిన్న పదాలు,
లోతైన అర్ధాన్నిచ్చే, చిన్న్న చిన్న భావాలు.
లయాత్మకంగా పొదగబడ్డ అక్షరాలు.
చాలా బాగుంది.
బొల్లోజు బాబా
Kranthi M said:
అదిరింది ప్రతాపు అదిరిందిలే గుండెల్ని ఎక్కడో పిండిందిలే.
With the similar feeling i wrote one thing when my friend leaves this world visit here
http://srushti-myownworld.blogspot.com/2008/01/blog-post_04.html
ప్రతాప్ said:
స్నేహితులని రోజూ కలుసుకోవడం కుదరడంలేదు అన్న ఫీలింగ్ తో నేను రాసిన కవిత మీ అందరికి నచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాని గారు, నా స్నేహితులని రోజూ కాకపోయినా ఇంకెప్పుడన్నా కలుసుకోగలనని తెలిసిన నాకే అంత బాధగా ఉంటే మీకెంత బాధగా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. వీడిన జ్ఞాపకాలనే లోకంగా మార్చి అందులోనే బ్రతికే వారికి మరీ కష్టం.
మహేష్ గారు మీ వంటి పఠనాసక్తి గల వారి పరిచయం కావడం నిజంగా నా అదృష్టం.
శిశిర said:
మీ కవిత లో "చిరునగవు చాటున దాగిన మౌనం మనస్సును మెలిపెడుతూంటే" అన్న వాక్యం అధ్భుతం.
కొన్ని సందర్భాలలో నిజంగానే మౌనం మనస్సుని మెలిపెడుతుందండీ.
కల said:
"కనురెప్పలు నీ జ్ఞాపకాల్ని మోయలేనంటూంటే..
కనుపాపలు నీ రూపాన్ని దాయలేనంటూంటే.."
ఎంత అందమైన భావం? ఎంత వేదనాభరితపు జాలం?
"అనుభూతుల హారంలో చేరిన పుష్పాలు నను చూసి జాలిపడుతూంటే..
ఎదలోతుల దారంలో కూరిన రాగాలు నను చూసి శిలలై పోతూంటే.."
ఎంత విషాదం? ఎంత దుఃఖం?
"చిరునగవు చాటున దాగిన మౌనం మనస్సును మెలిపెడుతూంటే..
అడుగుల మడుగులో దాగిన జంటపాదాలు నను ఓదారుస్తూంటే.."
ఎంత నిజం? ఎంత వేదన?
నిజం మౌనం మనస్సు మెలిపెడుతుంది. కన్నీటి మడుగులో దాగిన జంట పాదాలు ఎప్పటికి ఒదార్చేను? ఎన్నడు కన్నీరు తుడిచేను?
Commentors on this Post -
- రాధిక Posted: Tuesday, May 27, 2008 at 7:05:00 PM GMT+5:30
- రాధిక Posted: Tuesday, May 27, 2008 at 7:06:00 PM GMT+5:30
- arunakiranalu Posted: Tuesday, May 27, 2008 at 7:08:00 PM GMT+5:30
- Bolloju Baba Posted: Tuesday, May 27, 2008 at 7:31:00 PM GMT+5:30
- ప్రతాప్ Posted: Wednesday, May 28, 2008 at 10:17:00 AM GMT+5:30
- Anonymous Posted: Wednesday, May 28, 2008 at 9:24:00 PM GMT+5:30
- Anonymous Posted: Monday, June 2, 2008 at 2:27:00 AM GMT+5:30
- Kranthi M Posted: Tuesday, June 24, 2008 at 1:22:00 PM GMT+5:30
- Kathi Mahesh Kumar Posted: Tuesday, June 24, 2008 at 1:32:00 PM GMT+5:30
- ప్రతాప్ Posted: Tuesday, June 24, 2008 at 2:42:00 PM GMT+5:30
- శిశిర Posted: Friday, June 27, 2008 at 5:39:00 PM GMT+5:30
- కల Posted: Monday, October 6, 2008 at 11:27:00 AM GMT+5:30
రాధిక said:
touching one.